ఎన్టీఆర్ కోసం రూట్ మార్చిన త్రివిక్రమ్ !

Published on Aug 16, 2018 1:30 am IST


మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రూట్ మార్చాడా ? అరవింద సమేత టీజర్ చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తన మేకింగ్ స్టైల్ ను, తన రైటింగ్ స్టైల్ ను పూర్తిగా మార్చినట్లుగా కనిపిస్తోంది. త్రివిక్రమ్ ఎప్పుడు మీనింగ్ ఫుల్ డైలాగ్స్ కి ప్రాసలను యాసలను మిక్స్ చేసి మంచి కామెడీ మరియు ఎమోషనల్ ఎలిమెంట్స్ తో భారీ హిట్ కొడుతూ ఉంటాడు. అయితే ఎన్టీఆర్ తో అరవింద సమేతలో మాత్రం రివెంజ్ స్టోరీకి పూర్తి యాక్షన్ అంశాలను జోడించి తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోవటానికి ప్రయత్నస్తున్నట్లుగా కనిపిస్తోంది.

కాగా టీజర్ ఇప్పటికే సోషల్ మీడియాలో హల చల్ చేస్తోంది. ఎన్టీఆర్ అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అరవింద సమేత టీజర్ బాగా ఆకట్టుకుంటుంది. ఇక రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో జగపతిబాబు, నాగబాబు ఇద్దరు రెండు ఫ్యాక్షన్ గ్రూపులకు చెందిన నాయకుల పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More