‘మా’ ఎన్నికలు : ప్రకాష్ రాజ్ కి వ్యతిరేకంగా ఊహించని కోణాలు..

Published on Oct 9, 2021 6:10 pm IST

ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మా ఎన్నికలు(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) విషయంలో ఎలాంటి రచ్చ లేస్తుందో చూస్తూనే ఉన్నాము. ఊహించని విధంగా నటుడు ప్రకాష్ రాజ్ మరియు హీరో మంచు విష్ణు ల మధ్య మాటల యుద్ధం హీట్ ఎక్కింది. మరి ప్రధాన పోటీ ఈ రెండు ప్యానెల్స్ మధ్యనే ఉండడంతో అంతా బాగానే ఉంది కానీ ఎక్కడో పొలిటికల్ షేడ్స్ కూడా కనిపిస్తున్నాయని కూడా టాక్ ఉంది.

మరి తాజాగా అయితే ప్రకాష్ రాజ్ వైపు పొలిటికల్ కోణాలు హీట్ ఎక్కుతున్నాయి. గతంలో ప్రకాష్ రాజ్ ఓ రాజకీయ పార్టీని యథేచ్ఛగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీనితో వారు ఇప్పుడు ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తిని మా ఎన్నికల్లో ఎన్నుకోవద్దు అంటూ పిలుపునిచ్చారు. అంతే కాకుండా సోషల్ మీడియాలో పలువురు పెద్దలే ప్రకాష్ రాజ్ పై తీవ్ర స్థాయి పోస్టులు పెడుతూండటం హాట్ టాపిక్ గా మారుతుంది. మరి ఇదేమన్నా ఎఫెక్ట్ అవుతుందో లేక ప్రకాష్ రాజ్ ఏమన్నా స్పందిస్తారో లేదో అన్నది చూడాలి.

సంబంధిత సమాచారం :