తెలుగు చలన చిత్ర స్థాయిని పెంచడమే కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్ లోనూ 100 కోట్ల మార్క్ ని క్రాస్ చేసిన ఇండియన్ ఫస్ట్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ ‘బాహుబలి’. టాలీవుడ్ జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా రిలీజ్ అయ్యి 130 రోజులు దాటినా ఇప్పటికీ బాహుబలి పేరు మాత్రం ఇండియాతో పాటు ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా వినిపిస్తూనే ఉంది. ఇప్పటికే భుసన్, టొరంటో, తైపై గోల్డెన్ హార్స్ లాంటి ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ తో పాటు రీసెంట్ గా బ్లాక్ నైట్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా బాహుబలి సినిమాని ప్రదర్శించనున్నారు.
ఇప్పటి వరకూ ఆసియా వరకే పరిమితమైన బాహుబలి ఇప్పుడు ఆ ఎల్లలను దాటి అమెరికా ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా ప్రదర్శిచబడింది. అమెరికాలోని హనులులులో జరుగుతున్న హవాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా ఈ సినిమాని ప్రదర్శించారు. అక్కడి వారు కూడా అబాహుబలి సినిమాపై ప్రశంశలు కురిపించారు. బాహుబలి ఒక్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించిన ప్రతిసారి ఒక్కో ప్రాంతంలో ఇంటర్నేషనల్ రిలీజ్ కి సిద్దమవుతోంది. అందులో భాగంగానే జపాన్, చైనాలతో పాటు ఇండోనేషియా, థాయ్ ల్యాండ్, వియత్నాం, లాస్, కంబోడియా, మయన్మార్, టిమోర్ లిస్టే దేశాలలోబాహుబలిని రిలీజ్ చేయనున్నారు.


