
చాంపియన్ టెన్నిస్ లీగ్ ప్లేయర్స్ హైదరాబాద్ లోని ఎస్వీఎం ఫన్ సెంట్రల్ ఫోరం మాల్ లో సందడి చేశారు. ఫన్ సెంట్రల్ మాల్ లో ఇండోర్ గేమ్స్ ని ఆడారు. బౌలింగ్, ఎయిర్ గన్ షూటింగ్, బంపర్ కార్స్, ఆర్కేడ్ గేమ్స్, ఇండోర్ అడ్వెంచర్ గేమ్స్, బంగీ జంప్ వంటి వాటిని ఒకే చోట అందిస్తున్నది ఎస్వీఎం ఫన్ సెంట్రల్ మాల్. ఇక, ఈ సిటిఎల్ లో పాల్గొంటున్న హైదరాబాద్ ఏసెస్, చెన్నై వారియర్స్, నాగపూర్ ఒరంగేర్స్ జట్ల సభ్యులకు ఫోరం మాల్ ఘనంగా స్వగతం పలికింది.
ఇకపోతే, ఈ ఫోరం మాల్ లో బౌలింగ్, ఆర్కేడ్ గేమ్స్, సూపర్ బైక్స్, వీడియో గేమ్స్ తో పాటు బంగీజంప్ వంటివి ఎన్నింటినో ఇండోర్ అడ్వెంచర్ రూపంలో అందిస్తున్నది ఎస్వీఎం సెంట్రల్ ఫోరం మాల్. అటు గేమ్స్ తో పాటు ఇటు ఎంటర్టైన్మెంట్ అందించడమే లక్ష్యంగా ఫోరం మాల్ కృషి చేస్తున్నది.

