ఎవర్‌ గ్రీన్‌ హీరోయిన్‌ కి ఇంటర్నేషనల్‌ ఆఫర్లు..?

ఎవర్‌ గ్రీన్‌ హీరోయిన్‌ కి ఇంటర్నేషనల్‌ ఆఫర్లు..?

Published on May 16, 2020 6:38 PM IST

Ramya Krishna

కరోనా దెబ్బకు సినిమా చూడాలంటే థియేటర్స్ లోనే చూడాలి అనే రోజులు పోయాయి. లాక్ డౌన్ లో డిజిటల్ విప్లవం ఒక్కసారిగా విరుచుకుపడింది. నేటి యువతరం అభిరుచిని కూడా ఈ ఓటిటీ ప్లాట్ ఫామ్స్ అంతే వేగంగా మార్చాయి. ఇప్పుడు అందరూ డిజిటల్ స్ట్రీమింగ్‌ వైపే వెళ్తున్నారు. దాంతో భవిష్యత్తులో ఫిల్మ్ ఇండస్ట్రీస్ కూడా డిజిటిల్ వైపు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి రానుంది. ఈ క్రమంలోనే బడా నిర్మాతలు సైతం వెబ్ సిరీస్ లను నిర్మించాలని చూస్తుంటే.. స్టార్ హీరోయిన్లు సైతం డిజిటిల్ వైపు అడుగులు వేస్తున్నారు.

కాగా అందరికంటే ముందే ఎవర్‌ గ్రీన్‌ హీరోయిన్‌ రమ్యకృష్ణ గతేడాదే క్వీన్‌ అనే వెబ్‌ సిరీస్‌లో నటించారు. ఈ వెబ్‌ సిరీస్‌ తెలుగులో కూడా డబ్‌ అయింది. కాగా రమ్యకృష్ణ వెబ్ సిరీస్ ల గురించి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘వెబ్‌ సిరీస్‌ ల వల్ల నటులకు వెరైటీ రోల్స్‌ చేసే అవకాశం లభిస్తుంది. ఈ కరోనా దెబ్బకు వెబ్‌ సిరీస్‌ కి బాగా డిమాండ్‌ పెరిగింది. సినిమా కోసం థియేటర్స్‌ కి జనం వెళ్లడం మానేస్తారని అనను గానీ వెబ్‌ సిరీస్‌ కి కూడా సినిమా స్థాయిలోనే ఆదరణ వస్తుందని చెప్పగలను. నాకు ఇంటర్నేషనల్‌ వెబ్‌ సిరీస్‌ ఆఫర్లున్నాయి అని రమ్యకృష్ణ చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు