సూపర్ స్టార్ మహేష్ బాబు – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చిత్రబృందం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జనవరి 5న నిర్వహించనుంది. కాగా ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్న సంగతి తెలిసిందే. అలాగే లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ ఈవెంట్ రానున్నారు.
కాగా మెగాస్టార్ విజయశాంతి ఇద్దర్నీ ఒకే వేడుక పై ప్రేక్షుకులు చూడబోతున్నారు. అయితే అప్పట్లో హిట్ కాంబినేషన్ గా పేరొందిన చిరు – విజయశాంతి, కొరటాల సినిమాలో కలిసి నటించబోతున్నారని సోషల్ మీడియాలో ఓ ఇంట్రస్టింగ్ గాసిప్ వినిపిస్తోంది. మరి నిజంగానే ఈ హిట్ కాంబినేషన్ భవిష్యత్తులో స్క్రీన్ మీద మళ్లీ కలిసి నటిస్తే చాల బాగుంటుంది.
కాగా ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న భారీ ఎత్తున విడుదలకానుంది. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా ప్రత్యేక గీతంలో మెరవనుంది. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
