ఇంటర్వ్యూ: ఆకాష్ పూరి – ‘మెహబూబా’లో అనవసరమైన హీరోయిజం ఉండదు !

ఇంటర్వ్యూ: ఆకాష్ పూరి – ‘మెహబూబా’లో అనవసరమైన హీరోయిజం ఉండదు !

Published on May 8, 2018 3:59 PM IST

పూరి జగన్నాథ్ తన కుమారుడు ఆకాష్ పూరిని హీరోగా పరిచయం చేస్తూ తీసిన సినిమా ‘మెహబూబా’. మే 11న చిత్ర రిలీజ్ సందర్బంగా ఆకాష్ పూరి మీడియాతో మాట్లాడారు. ఆ సంగతులు మీకోసం..

సినిమా విడుదల పట్ల ఎగ్జైటెడ్ గా ఉన్నారా ?
ఈ సమయం కోసం 15 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నాను. నా కల నిజమైంది. ఈ వారం సినిమా విడుదలకాబోతోంది. సినిమా చాలా బాగా వచ్చింది. మంచి హిట్ సాధిస్తామనే నమ్మకం నాకుంది.

‘మెహబూబా’ ఎలాంటి లవ్ స్టోరీ ?
మా నాన్న రాసే ప్రేమ కథలు చాలా భిన్నంగా ఉంటాయి. ఈ కథ కూడా అలానే ఉంటుంది. ఇది పునర్జన్మల నేపథ్యంలో నడిచే కథ. మా నాన్న కథను డీల్ చేసిన విధానం చాలా కొత్తగా ఉంటుంది.

మీ పాత్ర ఎలా ఉండబోతోంది ?
ఇందులో నేను ఇండియన్ ఆర్మీకి చెందిన వాడిని. పాకిస్థాన్ అమ్మాయిని ప్రేమిస్తాను. ఈ పాత్ర కోసం చాలా శిక్షణ తీసుకున్నాను. ఎంతో మంది ఆర్మీ వాళ్లను గమనించాను. కొంచెం కష్టమనిపించింది. కానీ చేశాను.

మీ నాన్నగారితో పనిచేయడం ఎలా ఉంది ?
ఇది నా మొదటి సినిమా. అందుకే నన్ను పెద్దగా చూపించలేదు. నా పాత్ర కథతో పాటే వెళ్లిపోతుంటుంది తప్ప ఎక్కడా అనవసరమైన హీరోయిజం ఉండదు. చాలా బాగా చేశారు. ఆయన చేసిన మంచి సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఇందులో హీరోగా నటించినందుకు సంతోషంగా ఫీలవుతున్నాను.

మీకు స్ఫూర్తినిచ్చే హీరో ఎవరు ?
రజనీకాంత్ నా అలా టైం ఫేవరెట్ హీరో. ఆయనే నాకు ఇన్స్పిరేషన్.

మీ తదుపరి చిత్రాలేమిటి ?
నా తర్వాతి సినిమా కూడ నాన్నతోనే. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు