ఇంటర్వ్యూ : ఎ.ఎస్. ప్రకాష్ – ‘సర్కారు..’ 90% పార్ట్ ను సెట్స్ లోనే షూట్ చేశాము !

ఇంటర్వ్యూ : ఎ.ఎస్. ప్రకాష్ – ‘సర్కారు..’ 90% పార్ట్ ను సెట్స్ లోనే షూట్ చేశాము !

Published on Apr 25, 2022 2:49 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రానున్న సినిమా ‘సర్కారు వారి పాట’. కాగా ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ ప్రమోషన్స్ ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో మేము వివరణాత్మక ఇంటర్వ్యూ కోసం ఈ చిత్ర ఆర్ట్ డైరెక్టర్ ఎ.ఎస్. ప్రకాష్ తో ముచ్చటించాము. మరి ఎ.ఎస్. ప్రకాష్ చెప్పిన విషయాలు, విశేషాలు మీ కోసం..

 

మీ నేపథ్యం గురించి చెప్పండి ?

నేను వైజాగ్‌కి చెందినవాడినే. నా ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ పూర్తి అయ్యాక, సినిమా పరిశ్రమలోకి ప్రవేశించాను. మొదట్లో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితీష్ రాయ్ దగ్గర పని చేశాను. అక్కడ ఎక్కువగా స్కెచ్‌లు గీసేవాడిని. అప్పుడు సుకుమార్ గారు నా స్కెచ్‌లు చూసి ఆర్య సినిమాకి నాకు ఆఫర్‌ ఇచ్చారు.

 

ఆర్య నుంచి మీ ప్రయాణం ఎలా ఉంది ?

‘ఆర్య’ తర్వాత, నాకు చాలా ఆఫర్లు వచ్చాయి. ఆ సినిమా నుంచి నా ప్రయాణం అద్భుతంగా సాగింది, ఇప్పటి వరకు దాదాపు 50 సినిమాలు చేశాను.

 

‘సర్కారు వారి పాట’ సినిమా సెట్స్ వేస్తున్నప్పుడు మీకు ఎదురైన సవాళ్లేంటి?

సెట్స్ వేయడానికి ముందు చాలా విస్తృతమైన హోం వర్క్ చేయాల్సి ఉంటుంది. మేము ఈ సినిమాకి కూడా బాగా హోమ్ వర్క్ చేశాము. ఇక పాటల విషయానికొస్తే, సాహిత్యంలోని అర్థం ఆధారంగానే సెట్స్ వేశాము. ‘సర్కారు వారి పాట’లోని మాస్ సాంగ్స్ కోసం రెండు క్రేజీ సెట్లు వేశాం. ఈ సినిమాలో 90 శాతం పార్ట్ ను సెట్స్ లోనే పూర్తి చేశాము. ‘సర్కారు వారి పాట’ లాంటి సినిమాకి ప్లానింగ్ విషయానికి వస్తే, ఫైన్ ఆర్ట్స్‌లో నా మాస్టర్స్ డిగ్రీ చాలా సహాయపడింది. అలాగే, మా పనిని ఎప్పటికప్పుడు మెరుగుపరచడంలో మీడియా మరియు సాంకేతికత కూడా బాగా ఉపయోగ పడింది.

 

సెట్స్‌ డిజైన్‌ చేసేటప్పుడు మీరు ఎలా అప్రోచ్ అవుతారు?

ముందుగా సినిమా కథ, ఇతివృత్తం వింటాను. దర్శకుల కథనం నాకు పూర్తి ఆలోచనను అలాగే అవగాహనను కలిగిస్తోంది. వాటితో కొన్ని స్కెచ్‌లు గీసి దర్శకుడికి చూపిస్తాను. మార్పులు ఏమైనా ఉంటే దర్శకుడు సూచిస్తాడు. నా స్కెచ్ లు పూర్తిగా ఆమోదించిన తర్వాత, నేను నా సెట్‌ లను నిర్మించడం ప్రారంభిస్తాను.

 

సెట్స్ నిర్మాణం అంటే చాలా హార్డ్ వర్క్ ఉంటుంది ?

అవును ! సినిమా నిర్మాణ ప్రక్రియలో మా పని చాలా కష్టం. కెమెరామెన్ నుంచి ఫైట్ మాస్టర్స్ వరకు, ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన ఆలోచనలు ఉంటాయి. అలాగే సెట్స్ నిర్మాణం కూడా చాలా ఆలోచనలతో కూడుకున్నది. అన్ని వేళలా అందుబాటులో ఉండి మేము షూట్ సాఫీగా సాగేలా చూడాల్సి ఉంటుంది.

 

మీకు ఇష్టమైన దర్శకుడు ఎవరు ?

నేను ఇప్పటివరకు చాలా ప్రతిభావంతులైన దర్శకులతో పని చేశాను. కాబట్టి, నాకు ప్రత్యేకమైన ఇష్టమైన దర్శకుడు అంటూ ఎవరూ లేరు.అందరితో పని చేయడం ఇష్టమే.

 

ఇప్పటి వరకు మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏది ?

శ్రీమంతుడు సినిమా చూసిన తర్వాత ప్రభాస్ నన్ను చాలా మెచ్చుకున్నారు. సెట్స్ కోసం ఉపయోగించిన ప్రాపర్టీలను కూడా అడిగి తెలుసుకున్నాడు. అప్పుడు ప్రభాస్ మాట్లాడిన మాటలు నాకు చాలా గౌరవంగా అనిపించాయి. నా మనసుకు హత్తుకున్నాను.

 

మీరు దాదాపు 50 సినిమాలు చేశారు. అయినా ఎందుకు పబ్లిక్ ప్లాట్ ఫామ్స్ లో మీకు బాగా పేరు రాలేదు ?

ఎందుకంటే నేను కేవలం నా వర్క్ పై మాత్రమే దృష్టి సారిస్తాను. నేను ఎవరితోనూ ఎక్కువగా టచ్ లో ఉండను. నేను ఎప్పుడు నా స్కెచ్‌ లతో, లొకేషన్ లతో.. సినిమా సెట్‌లను నిర్మించడంలోనే బిజీగా ఉంటాను.

 

మీ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ?

నేను ప్రస్తుతం అఖిల్ చిత్రం, రామ్ హీరోగా స్రవంతి మూవీస్ బ్యానర్‌లో మరో రెండు ప్రాజెక్ట్‌ల కోసం పని చేస్తున్నాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు