ఇంటర్వ్యూ: నాగార్జున – ‘మనం’ అనే టైటిల్ ఈ సినిమాకి నాన్నగారే పెట్టారు

ఇంటర్వ్యూ: నాగార్జున – ‘మనం’ అనే టైటిల్ ఈ సినిమాకి నాన్నగారే పెట్టారు

Published on May 19, 2014 8:26 PM IST

Nagarjuna-New-Photos-(18)

అక్కినేని కుటుంబానికి చెందిన మూడు తరాల హీరోలు కలిసి నటించిన సినిమా ‘మనం’. ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఈ సినిమా శుక్రవారం విడుదల కానున్న సందర్బంగా, ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్న కింగ్ అక్కినేని నాగార్జునతో కాసేపు ముచ్చటించాం. ఆ విశేషాలు మీ కోసం..

ప్ర) ‘మనం’ సినిమాకి రూపకల్పన ఎలా జరిగింది?
స) మా కుటుంబ సభ్యులతో కలిసి ఇలాంటి ఒక సినిమా తీయాలని నాకు చాలా కాలం నుండి ఉంది, కానీ సరైన స్క్రిప్ట్స్ రాలేదు. అనుకోకుండా ఒక రోజు మా ఫ్యామిలీ ఫ్రెండ్ సుధాకర్ రెడ్డి (హీరో నితిన్ తండ్రి), నాకు ఫోన్ చేసి ఈ కథ వినమని చెప్పాడు. ఈ స్టొరీ లైన్ విన్న వెంటనే నాకు చాలా నచ్చింది. కానీ ఈ సినిమా తీసే ముందు తనను తాను నిరూపించుకోవాలని దర్శకుడు విక్రంను కోరాను. విక్రం ‘ఇష్క్’ సినిమాను నాకు విడుదలకు ముందే చూపించాడు, ఆ సినిమా చుసిన వెంటనే ‘మనం’ సినిమాకి ఒకే చేప్పాను. ఆ తరువాత ఆయనను నాన్నగారి దగ్గరికి పంపాను. నాన్న కొన్ని సలహాలు చెప్పారు, అంతే అక్కడి నుండి ‘మనం’ సినిమా ప్రయాణం మొదలయింది.

ప్ర) ఈ సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ గురించి చెప్పండి?
స) నిజం చెప్పాలంటే, ‘మనం’ సినిమాను నేను ఎప్పుడు ఒక కమర్షియల్ సినిమాలా అనుకోలేదు. ఏదో ధైర్యం, స్టొరీ లైన్ పై ఉన్న నమ్మకంతో ముందుకు వెళ్ళా. నా క్యారీర్ లో ఎలాంటి అంచనాలు పెట్టుకొని సినిమాలే అధ్బుత విజయాలను అందుకున్నాయి. ‘మనం’ సినిమా కూడా అదే కోవలోకి వస్తుంది.

ప్ర) ఈ సినిమాకి ‘మనం’ టైటిల్ ఎందుకు పెట్టారు?
స) సినిమాకి ‘మనం’ అనే టైటిల్ ను నాన్నగారు పెట్టారు. మొదట దర్శకుడు విక్రం హిందీ టైటిల్ ‘హమ్’ పెడుదాం అని అన్నాడు, కానీ మాకు అది నచ్చలేదు, అందువలన ఈ సినిమాకి ‘మనం’ టైటిల్ ఖరారైంది. అయితే ఈ సినిమాలో మా కుటుంబానికి చెందిన మూడు తరాలు ఉన్నాయి కనుక ఈ సినిమాకి ‘మనం’ టైటిల్ చాలా బాగా సూట్ అయింది.

ప్ర) ఈ సినిమా తీయడానికి మీకు ఏదైనా సంఘటన కానీ లేదా ఏదైనా సినిమా ప్రేరేపితం చేశాయా?
స) లేదు, ఇది విక్రం మెదడుకు తట్టిన ఒక కొత్త కథ. ఇది ఏ ఇతర సంఘటనలు, సినిమాల నుండి స్పూర్తి కాదు.

ప్ర) ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వర్ రావుగారి పాత్ర గురించి చెబుతారా?
స) ఈ సినిమాలో నాన్న గారు ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తారు. అయన క్యారెక్టర్ ఇంటర్వెల్ సమయంలో పరిచయం అవుతుంది, అక్కడి నుండి శుబం కార్డు వరకు ఉంటుంది. మధ్యలో ఎన్నో క్యారెక్టర్స్ వస్తూ పోతూ ఉంటాయి.

ప్ర) ‘మనం’లో అమితాబ్ బచ్చన్ ని అతిధి పాత్రలో ఎందుకు పెటాల్సి వచ్చింది?
స) నాన్నగారికి అమితాబ్ బచ్చన్ అంటే చాలా ఇష్టం. అందుకనే అయన ఆఖరి సినిమాలో
అమితాబ్ గారిని పెట్టి నాన్నగారికి నివాళులు అర్పిద్దాం అనుకున్నాం. అమితాబ్ గారికి ఈ విషయం చెప్పగానే, ఏఎన్అర్ గారి ఆఖరి సినిమాలో నటించడం నా అదృష్టం అని చెప్పి వెంటనే ఒప్పుకున్నారు.

ప్ర) ఈ సినిమాకి ఆడియో ఫంక్షన్ ఎందుకు చేయలేదు?
స) నాన్న గారు పోయేక మేమందరం చాలా భాధలో ఉండిపోయం, ఆడియో ఫంక్షన్ చేయడానికి ఇది సరైన సమయం కాదని భావించి, ఏలాంటి ఫంక్షన్ చేయలేదు.

ప్ర) టైటిల్స్ లో నిర్మాత కార్డు వద్ద అక్కినేని కుటుంబం అని వస్తుంది, దీని వెనుకున్న కారణం ఏంటి?
స) నాన్నగారి ఆఖరి రెండు నెలలలో మా కుటుంబం అంత చాలా దగ్గర అయ్యాం, దానికి కారణం కేవలం మా నాన్న గారు, అయన పంచిన అనుబంధాలే మమల్ని ఇలా నడిపిస్తున్నాయి. ఇప్పటి నుండి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ నుండి వచ్చే ప్రతి సినిమాలో నిర్మాత పేరు దగ్గర ‘అక్కినేని కుటుంబం’ అనే వస్తుంది.

ప్ర) నాన్నగారు మరియు మీ వంటి గొప్ప నటుల మధ్య నాగ చైతన్య ఎలా నటించాడు?
స) నాగ చైతన్య ఈ సినిమాలో అధ్బుతంగా నటించాడు. దర్శకుడు విక్రం తనను ఒక అసాధారణమైన నటుడిగా మలిచాడు. ఈ సినిమాలో తన పరిణితి చెందిన నటనతో నాగ చైతన్య అందర్ని అక్కట్టుకోబోతున్నాడు.

ప్ర) ఈ సినిమా ప్రీమియర్ గురించి చెబుతారా?
స) మే 22న ఈ సినిమా ప్రీమియర్ కి పెద్ద ఎత్తున ప్లాన్ చేసాం. మీడియా ఏఎన్అర్ అభిమానులు, ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు అందరూ ఈ ప్రీమియర్ కి హాజరవుతారు.

ప్ర) మీ తదుపరి సినిమాల గురించి చెబుతారా?
స) నేను మణిరత్నంతో తీయబోయే సినిమాను ప్రస్తుతానికి పక్కన పెట్టాం. త్వరలో జూ.ఎన్టీఅర్ తో కలిసి ఒక సినిమా చేయబోతున్నాను.

ప్ర) ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’, ఈ గేమ్ షో ఏలా రూపుదిద్దుకుంటుంది?
స) ఈ గెమ్ షో షూటింగ్ మే నెలాఖరుకు మొదలవుతుంది. ఈ షో చేయడానికి నేను చాలా ఆసక్తిగా ఉన్నాను, నా షోలో ప్రజల జీవితాలు ఏలా మారుతాయో చుడాలనుకుంటున్నాను.

అంతటితో నాగార్జున గారికి ఆల్ ది బెస్ట్ చెప్పి మా ఇంటర్వ్యూని ముగించాం.

 

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు