ఇంటర్వ్యూ : నాని – జెర్సీ కన్నీళ్లు తెప్పిస్తుంది !

Published on Apr 17, 2019 1:46 pm IST

‘మళ్ళీరావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా జెర్సీ. ఈచిత్రం ఈనెల 19న విడుదలకానున్న సందర్బంగా నాని మీడియా తో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం …

జెర్సీ ,రమణ్ లంబా బయోపిక్ అంటున్నారు నిజమేనా ?

ఈన్యూస్ నేను కూడా విన్నాను. టీజర్ విడుదలయ్యాక ఈ న్యూస్ వైరల్ అయ్యింది. ఒక సారి సినిమా చూసాక ప్రేక్షకులకు అర్ధమవుతుంది. ఇది ఫిక్షనల్ స్టోరీ అని.

మజిలీ , జెర్సీ ల మ‌ధ్య ఏమైనా పోలిక‌లుంటాయా?

మజిలీ నేను చూడ‌లేదు కాబట్టి నేను ఇప్పుడు ఏం చెప్పలేను. పైగా శివ మావాడు. ‘నిన్ను కోరి`తో కెరీర్ స్టార్ట్ చేశాడు. ఎప్ప‌టిక‌ప్పుడు టీజ‌ర్లు, ట్రైల‌ర్లు పంపించేవాడు. నాకు చాలా చాలా నచ్చేశాయి అవ‌న్నీ. నిజంగా `జెర్సీ`ప్ర‌మోష‌న్స్, `గ్యాంగ్ లీడ‌ర్‌` సినిమా షూటింగ్ లేకుండా ఉంటే ఎప్పుడో వ‌రుస‌గా సినిమాలు చూసుండేవాడిని.

మీరు క్రికెట్ ఆడేవారా?

నేను గ‌ల్లీ క్రికెట్ ఆడేవాడిని. స్కూల్లో కూడా నేను లాస్ట్ బ్యాట్స్ మేన్‌ని. కొన్ని సార్లు నా టీమ్లో అంద‌రూ ఓడిపోతేనో, లేకుంటే ఎవ‌రికో ఒక‌రికి దెబ్బ‌లు త‌గిలితేనో నాకు అవ‌కాశం వ‌చ్చేది. ఆ బ్యాచ్ అన్నమాట‌.

ఈ సినిమా కోసం ఎక్కడ శిక్షణ తీసుకున్నారు?

డేనియ‌ల్ క్రికెట్ అకాడమీ లో ట్రైనింగ్ తీసుకున్నాను. అది సిటీలోనే బెస్ట్ క్రికెట్ అకాడమీ. డేనియ‌ల్ నాకు శిక్ష‌ణ ఇచ్చారు. షూటింగ్ స్పాట్‌కి కూడా ఆయ‌న వచ్చేవారు.

మళ్ళీరావా చూసి ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారా ?

నేను ఆ సినిమా చూడలేదు. గౌతమ్ స్టోరీ నరేషన్ ఇస్తున్నప్పుడు పాత్ర‌లో నేను లీన‌మైపోయాను. అత‌నిలో నిజాయ‌తీ న‌చ్చింది. అందుకే నేను అత‌ని ప్రీవియ‌స్ సినిమా చూసి జ‌డ్జి చేయాల‌ని అనుకోలేదు. నేనే కాదు, ఈ సినిమా చేసిన వారంద‌రూ చాలా గొప్ప ప‌ని చేశామ‌నే ఫీలింగ్‌లో ఉన్నారు. సంతోషంతో క‌ళ్ల‌ల్లో నీళ్లు తిరిగే సీన్లు కూడా ఉన్నాయి.

ఈ సినిమా నిర్మాత గురించి ?

నేను , వంశీ క్లాస్ మేట్స్ . క్రికెట్ అంటే అతనికి పిచ్చి. ఒక‌సారి మా క్లాస్‌మేట్ క‌లిసిన‌ప్పుడు ఇండ‌స్ట్రీలో వంశీ ఉన్నాడ‌ని తెలిసింది. ఈ సినిమాకు ముందు మాట్లాడుకున్నాం. ఈ సినిమా మొత్తానికి కాస్త కంగారుగా ఎవ‌రైనా ఉన్నారా అంటే అది వంశీ మాత్ర‌మే. తను జెన్యూన్ ప్రొడ్యూస‌ర్‌.

అనిరుద్ గురించి ?

అనిరుద్ ఎక్స్ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చాడు. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్ అవుతుంది. ఆయన సంగీతం సినిమాను మరో లెవ‌ల్‌కి తీసుకెళ్తుంది.

సంబంధిత సమాచారం :

X
More