ఇంటర్వ్యూ : ఆటగాళ్లు చిత్రం రెండు ఇంటలెక్చువల్ బ్రైన్స్ మధ్య జరిగే గేమ్ – నారా రోహిత్

ఇంటర్వ్యూ : ఆటగాళ్లు చిత్రం రెండు ఇంటలెక్చువల్ బ్రైన్స్ మధ్య జరిగే గేమ్ – నారా రోహిత్

Published on Aug 21, 2018 4:02 PM IST


వైవిధ్యమైన పాత్రలతో సినిమాలతో ప్రేక్షకులను అలరించే హీరో నారా రోహిత్. ఆయన తాజాగా జగపతిబాబుతో కలిసి నటించిన చిత్రం ‘ఆటగాళ్ళు’. ఈ నెల 24న విడుదలకాబోతున్న సంధర్బంగా నారా రోహిత్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం…

ఆటగాళ్లు చిత్రం మీరు చెయ్యటానికి కారణం ఏమిటి ?
డైరెక్టర్ పరుచూరి మురళి ఈ స్క్రిప్ట్ తో నా దగ్గరికి వచ్చి కథ చెప్పినప్పుడు సింగిల్ సిట్టింగ్ లోనే నాకు కథ బాగా నచ్చింది. కానీ నేనప్పుడు ఓ కమర్షియల్ సినిమా చేద్దాం అనే మూడ్ లో ఉండి వెంటనే ఈ చిత్రాన్ని అంగీకరించలేదు. ఆయనతో కమర్షియల్ లైన్ ఉంటే చెప్పండి అన్నాను. మురళిగారు కొన్ని రోజుల తరువాత మళ్లీ ఈ స్క్రిప్ట్ తోనే వచ్చారు. నా బాడీ లాంగ్వేజ్ కి నా మాడ్యులేషన్ కి ఈ చిత్రం తగినట్లుగా ఉంటుందని ఆయన నన్ను కన్వీన్స్ చేసి ఒప్పించడం జరిగింది. ఆ విధంగా ఆటగాళ్లు చిత్రం మీ ముందుకు రాబోతుంది.

ఈ సినిమాలో మీ పాత్రతో పాటు సమానమైన పాత్రలో జగపతి బాబుగారు కనిపిస్తున్నారు. దాని గురించి మాకు చెప్పండి?
వాస్తవానికి మా దర్శకుడు మురళి జగపతి బాబు సర్ ఈ సినిమాలో లాయర్ పాత్రను చేస్తున్నట్లు నాకు చెప్పలేదు. కానీ ఓ కార్యక్రమంలో జగపతిబాబుగారిని కలుసుకున్నప్పుడు మురళి స్క్రిప్టును చెప్పాడు అని అన్నారు. ఇక జేబీ సార్ తో కలిసి నటించడం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ సినిమా చూశాకా ఆ పాత్రకు అంత సులువుగా ఆయన తప్ప ఇంకెవ్వరూ చెయ్యలేరనిపించింది.

కమర్షియల్ అనుకోని మీరు చేసిన ‘బాలక్రిష్ణుడు’ చిత్రం ఫలితం, కమర్షియల్ చిత్రాల పై మీ అభిప్రాయాన్ని మార్చిందా ?
ఆలా అని చెప్పలేను గాని, ఈ చిత్రం మాత్రం బాగా డిజప్పాయింట్ చేసింది. అయితే కమర్షియల్ ఫిల్మ్ ప్రతిదీ సరైన సమయంలో సరిగ్గా వస్తే మంచి సక్సెస్ సాధిస్తాయి. నాకు ఇప్పటికి భవిష్యత్తులో మంచి కమర్షియల్ చిత్రం చేయాలనే ఉంది.

అసలు ఈ ఆటగాళ్లు గురించి చెప్పండి ?
ఈ సినిమాలో నేను ఓ సినిమా దర్శకుడిగా నటించాను. అలాగే జగపతిబాబుగారు లాయర్ గా చేశారు. సింపుల్ గా చెప్పాలంటే మా ఇద్దరు పర్సనల్ ప్రాబ్లమ్స్ ను ఎలా సాల్వ్ చేసుకున్నామన్నదే ఈ చిత్ర కథ. మైండ్ గేమ్ తో చాలా ఆసక్తికరంగా కథనం రొటీన్ కి బిన్నంగా సాగుతుంది.

మరి మీ ఇద్దరి పాత్రల్లో ఎవరి పాత్ర హైలెట్ కానుంది ?
సినిమాలో మా ఇద్దరి పాత్రలు హైలెట్ గానే ఉంటాయి అండి. అంటే ఓ సన్నివేశంలో ఒకరు హైలెట్ అయితే, మరొక సన్నివేశంలో మరొకరు హైలెట్ అవుతారు. మా రెండు పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బాగుంటాయి.

మీ దర్శకుడు పరుచూరి మురళి గురించి చెప్పండి?
ఆయన ఇప్పటికే సక్సెస్ అయిన డైరెక్టర్. అయితే ఈ ఆటగాళ్లు చిత్రం మాత్రం మురళిగారి మునుపటి చిత్రాలకి భిన్నంగా ఉంటుంది. ప్రేక్షకులందరూ ఈ సినిమా చూసిన తర్వాత అదే మాట చెబుతారనుకుంటున్నాను.

మీ తదుపరి ప్రాజెక్టులు ఏమిటి ?

ప్రస్తుతం వీరభోగ వసంతరాయులు విడుదల అవడానికి సిద్ధంగా ఉంది. అలాగే ‘శబ్దం’ అనే మరో సినిమా చెయ్యబోతున్నాను. అది కాకుండా నా మొదటి సినిమా ‘బాణం’ డైరెక్టర్ చైతన్య దంతులూరితో ఓ సినిమా చేస్తున్నాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు