ఇంటర్వ్యూ : అనీల్ రావిపూడి – “గాలి సంపత్”లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎక్కువే ఉంటాయి..

Published on Mar 9, 2021 5:00 pm IST

రీసెంట్ గా విడుదలకు రెడీ అవుతున్న పలు ఆసక్తికర ప్రాజెక్ట్ లలో టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు నటించిన “గాలి సంపత్” కూడా ఒకటి. అయితే ఈ సినిమాను సమర్పిస్తుంది టాలీవుడ్ టాప్ దర్శకుడు అనీల్ రావిపూడి సమర్పిస్తుండడంతో మరో స్థాయికి ఇది వెళ్ళింది. మరి ఈ సందర్భంగా ఈ దర్శకుడి నుంచి ఓ ఇంటర్వ్యూ తీసుకున్నాం. ఇక ఇందులో అనీల్ ఏం చెప్పారో పరిశీలిద్దాం..

అసలు ఈ ప్రాజెక్ట్ ఎలా బయటకొచ్చింది?

ఈ కథ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అయిన ఎస్ కృష్ణది. తాను ఎలాగో నా అన్ని సినిమాలకు వర్క్ చేసాడు. తను నిర్మాత అయ్యే సమయంలోనే గాలి సంపత్ స్క్రిప్ట్ రాసుకున్నాడు. నాకు తన లైన్ బాగా నచ్చింది. అందుకే ఈ సినిమా నేనే ప్రెజెంట్ చెయ్యాలి అనుకున్నా.

మరి మీ నుంచి ఎలాంటి సూచనలు ఇచ్చారు?

నా నుంచి ఈ సినిమాను ప్రెజెంట్ చేస్తున్నాను అనే మూమెంట్ నే చాలా ఎంజాయ్ చేసా..డైరెక్టర్ తో కూర్చొని సెకండాఫ్ లో అలాగే స్క్రీన్ ప్లే కి హెల్ప్ చేశాను. ఇందులో మంచి ఎమోషన్స్ సెకండాఫ్ లో మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కలిపి ఉంటుంది. అలాగే డైరెక్టర్ అనీష్ చాలా మంచి జాబ్ అందించాడు.

తండ్రి-కొడుకుల కోణం నుంచి ఏ అంశాన్ని చూపిస్తున్నారు?

రాజేంద్ర ప్రసాద్ గారు అలాగే శ్రీ విష్ణు ఇందులో తండ్రీకొడుకులుగా చేశారు. ట్రైలర్ లో చూపించినట్టే వాళ్లకి మంచి ఐడియాలజీ ఉంటాయి. అలాగే ఈ సినిమాలో వారికి ఓ ఈగో క్లాష్ వల్ల ఎలాంటి సమస్యలు వచ్చాయ్ సెకండాఫ్ లో ఎలా ఉంటుంది అన్నవి బాగా కనిపిస్తాయి.

మీది రాజేంద్ర ప్రసాద్ గారి పేర్లు ఉన్నాయ్..కామెడీ ఎంత మేర ఆశించొచ్చు?

ఈ సినిమా స్టార్ట్ చేసిన మొదటి రోజు నుంచి కూడా ఒక ఎమోషనల్ డ్రామా గానే అనుకున్నాం మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అది కూడా..ముందు మంచి ఫన్ గానే స్టార్ట్ అయినా తర్వాత మారుతుంది. సో నా పేరు చూసి ఎక్కువగా కామెడీ ఉంటుంది అని ఆశించి రాకండి ఇది థ్రిల్లర్ కు మించి ఉంటుంది.

రాజేంద్ర ప్రసాద్ గారి రోల్ అండ్ పెర్ఫామెన్స్ కోసం చెప్పండి?

ఆ రోల్ కు మా ఫస్ట్ ఛాయిస్ ఆయనే..గాలి సంపత్ కు ఆయన లైఫ్ ఇచ్చారని చెప్పొచ్చు. ఆ ఈ సినిమాలో చేసిన నటన ఖచ్చితంగా ప్రతీ ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంది ఈ విషయంలో మా అందరికీ చాలా నమ్మకం ఉంది. అలాగే శ్రీ విష్ణుతో తనకు ఉన్న సీన్స్ కూడా చాలా బాగుంటాయి.

మరి ఫ్యూచర్ లో మరిన్ని చిన్న సినిమాలను సపోర్ట్ చేస్తారా?

ఖచ్చితంగా, నేనెప్పుడూ కూడా అనుకుంటా చెయ్యాలి అని. గాలి సంపత్ నా ఫస్ట్ అటెంప్ట్ మంచి కంటెంట్ తో తీసింది ఇది. ఇది కనుక క్లిక్ అయితే ఖచ్చితంగా నా నుంచి సపోర్ట్ మాత్రమే కాకుండా డైరెక్షన్ కూడా చెయ్యడానికి రెడీనే…

మీ ఎఫ్3 అప్డేట్ ఏమన్నా చెప్తారా.?

ఈ సినిమా ఎఫ్2 కి మాత్రం ఎలాంటి సీక్వెల్ కాదు.. కానీ ఫన్ మాత్రం గట్టిగానే ఉంటుంది. ఇప్పటికే 22 రోజుల షూట్ ను కంప్లీట్ చేసేసాం. ఇంతవరకు వచ్చిన అవుట్ ఫుట్ కూడా సూపర్బ్ గా వచ్చింది. అలాగే ఈ సబ్జెక్టు పై కూడా నాకు చాలా నమ్మకం ఉంది.

మళ్ళీ మహేష్ తో అలాగే బాలయ్య గారితో కూడా సినిమాలు చేస్తారట?

ఈ సినిమాలు లైన్ లో అయితే ఉన్నాయి కానీ ఇంకా జస్ట్ డిస్కషన్ స్టేజ్ లోనే ఉన్నాయి. ప్రస్తుతం అయితే అంతా ఎఫ్3 పైనే నా దృష్టి ఉంది. అది రిలీజ్ అయ్యాక నెక్స్ట్ సినిమా కోసం ఆలోచిస్తా..

సంబంధిత సమాచారం :