ఇంటర్వ్యూ : డైరెక్టర్ అనుదీప్ – నాగశ్విన్ వల్లనే “జాతి రత్నాలు” అంత బాగా వచ్చింది

Published on Mar 9, 2021 3:00 pm IST


రీసెంట్ గా మంచి హైప్ ను తెచ్చుకున్న చిన్నపాటి చిత్రం “జాతి రత్నాలు”. టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి హీరోగా ప్రియదర్శి మరియు రాహుల్ రామకృష్ణలు మరో కీలక పాత్రల్లో నటించిన హిలేరియస్ ఎంటర్టైనర్ చిత్రం “జాతి రత్నాలు”. మరి ఈ చిత్రం విడుదల సందర్భంగా దర్శకుడు అనుదీప్ నుంచి ఓ ఇంటర్వ్యూ తీసుకున్నాం మరి తాను ఎలాంటి విషయాలు పంచుకున్నాడో ఇప్పుడు చూద్దాం.

ఈ జాతి రత్నాలు అనే సినిమా ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది?

ఈ కథ ఎలా స్టార్ట్ అయ్యిందంటే అసలు ఏమీ తెలీని ఒక ముగ్గురు ఇనోసెంట్స్ అంటే జైలు కోసం కానీ కోర్టుల కోసం కానీ తెలియని వారు ఇరుక్కుంటే ఎలా ఉంటుంది అనిపించింది. అక్కడ నుంచి ఈ కథ స్టార్ట్ అయ్యింది.

నాగ్ అశ్విన్ గారు మిమ్మల్ని ఎలా కలిశారు, మీకెలా అనిపించింది?

నేను పదేళ్ల కితం ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను అది చూసి ఆయన కలిశారు అప్పుడే పిట్ట గోడ లైన్ చెప్పడం జరిగింది అది నచ్చడంతో డెవలప్ చేసి సినిమా చేసాం. ఆ సినిమా ప్లాప్ అయినా కూడా ఇప్పుడు అవకాశం ఇవ్వడం చాలా హ్యాపీ అనిపించింది.

ఈ ముగ్గురినే ఎందుకు తీసుకున్నారు?వాళ్ళ రోల్స్ ఎలా ఉంటాయి.?

ముందుగా నవీన్ ను అయితే నాగస్విన్ ప్రిపేర్ చేశారు. ఇంకా మిగతా ఇద్దరి రోల్స్ కి చాలా మందినే అనుకున్నాం వేరే వాళ్లకి ఆడిషన్ చేసాం వీళ్ళకి కూడా చేసాం కానీ రెండు కంపేర్ చేసి చూస్తే వీరిదే బాగుంది అందుకే ఈ ఇద్దరినీ తీసుకున్నాం. ఇంకా ఈ సినిమాలో వాళ్ళు రోల్స్ చాలా బాగుంటాయి వాళ్ళు కామెడీ చెయ్యరు కానీ వాళ్ళు చేసే పనుల వల్ల మంచి కామెడీ జెనరేట్ అవుతుంది.

నాగశ్విన్ నిర్మాత, అలాగే ఒక డైరెక్టర్ తాను కథలో ఎలాంటి సూచనలు ఇచ్చారు?

ఈ సినిమా కథను నేను నాగశ్విన్ అలాగే సమీర్ అనే ఇంకొకతను ముగ్గురం కలిసి డెవలప్ చేసాం. నేను అయితే అవుట్ అండ్ ఫన్ గా తీద్దాం అనుకున్నాను ఇక అక్కడ నుంచి ముగ్గురు కలిసి కంప్లీట్ చేసాం.

ఫరియా అబ్దుల్లాతో కలిపి నలుగురిలో ఎవరి రోల్ బాగా గుర్తుంటుంది?

ఆమె ఒక్క రోల్ అనే కాకుండా సినిమా ప్రతీ ఒక్కరి రోల్ కూడా గుర్తుండిపోయే ఇంపాక్ట్ లో ఉంటుంది. ఎవరికీ అనేది చెప్పలేను ప్రతీ ఒక్కరికీ కూడా మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది అది రేపు సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది.

మ్యూజిక్ కోసం చెప్పండి, చిట్టి సాంగ్ చాలా పెద్ద హిట్టయ్యింది…

నేను మ్యూజిక్ డైరెక్టర్ కోసం అనుకుంటున్నప్పుడు నాగశ్విన్ నాకు రాధన్ పేరుని సజెస్ట్ చేసాడు. స్క్రిప్ట్ విన్నాక అతను చాలా ఎగ్జైట్ అయ్యాడు కొత్త మ్యూజిక్ ఇవ్వడానికి నాకు కూడా చాలా బాగుంటుంది అని చెప్పాడు. ఎప్పుడైనా నేనే కాస్త కన్ఫ్యూజన్ లో ఉండి ట్యూన్ మార్చమని అడిగినా ఎప్పుడైనా పంపిస్తాడు మంచి ఆర్ ఆర్ కూడా ఇచ్చాడు.

మీ లాస్ట్ సినిమా కూడా కామెడీ యాంగిల్ లోనే ఉంటుంది అవే తీస్తారా ఇక?

అవే అని కాదు అన్ని జానర్ సినిమాలు తియ్యాలి అనుకుంటాను ఒక్క హర్రర్, వైలెన్స్ సినిమాలు తప్ప. అవి మాత్రం నేను చెయ్యలేను. అలాగే ఒక ఎమోషనల్ డ్రామా చెయ్యాలి అనుకుంటున్నాను ప్రస్తుతం ఒక మార్షల్ ఆర్ట్స్ కామెడీ స్క్రిప్ట్ రాస్తున్నాను.

ఈ సినిమా చేసేటప్పుడు నాగశ్విన్ కు మీకు ఏమన్నా విభేదాలు వచ్చాయా?

అలాంటివి ఏమీ లేవు నిజానికి నాగశ్విన్ అస్సలు ఈగో లేని వ్యక్తి, తాను ఏవన్నా ఇన్ పుట్స్ చెప్పినా నేను వేరేలా చెప్పినా సరే ఇదే చెయ్యాలి అని అలాంటివి చెప్పేవాడు కాదు చాలా ఈగో లెస్ పర్సన్ తాను అందుకే జాతి రత్నాలు అవుట్ ఫుట్ అంత బాగా వచ్చింది.

మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి?ఇండస్ట్రీ లోకి ఎలా రావాలి అనిపించింది?

మాది నేటివ్ సంగారెడ్డి, ఇక్కడ అమీర్ పేట్ లోనే డిగ్రీ కంప్లీట్ చేశాను. ఇంకా ఊహ తెలిసినపుడే ఎందులో ప్లెజర్ ఉంటుందో తెలుస్తుంది అప్పుడే నాకు సినిమాల్లో అది అనిపించింది. డైరెక్టర్ అవ్వాలి అనుకోలేదు కానీ సినిమాల వల్ల ప్లెజర్ అనిపించింది. డిగ్రీ అయ్యాక మెల్ల మెల్లగా డైరెక్షన్ లోకి వచ్చాను.

ఇక మరి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి?

కొన్ని కథలు ఉన్నాయి, ప్రస్తుతం అయితే మార్షల్ ఆర్ట్స్ కామెడీ రాస్తున్నా అది కూడా నాగశ్విన్ తో డిస్కస్ చేసి ఫైనల్ చేస్తా అది కూడా ఇదే బ్యానర్ లో ఉంటుంది. దీనితో పాటు కొన్ని డ్రామాస్ కూడా ఉన్నాయి.

సంబంధిత సమాచారం :