ఇంటర్వ్యూ : సుమంత్ – “కపటదారి”ని ఒరిజినల్ కంటే షార్ప్ గా తీసాం

ఇంటర్వ్యూ : సుమంత్ – “కపటదారి”ని ఒరిజినల్ కంటే షార్ప్ గా తీసాం

Published on Feb 18, 2021 5:01 PM IST


చాలా కాలం బ్రేక్ అనంతరం “సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం”, “ఇదంజ‌గ‌త్‌” చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సొంతం చేసుకున్న క‌థానాయ‌కుడు సుమంత్ చేసిన లేటెస్ట్ మూవీ “క‌ప‌ట‌ధారి”. ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి ద‌ర్శ‌క‌త్వంలో క్రియేటివ్ ఎంట‌ర్‌టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూట‌ర్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని డా.ధ‌నంజ‌యన్ నిర్మించారు. ఫిబ్రవరి 19న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో సుమంత్ తో ఓ ఇంటర్వ్యూ తీసుకున్నాం మరి ఇందులో సుమంత్ ఎలాంటి విషయాలు పంచుకున్నాడో చూద్దాం.

ఇప్పుడు మీ నుంచి థ్రిల్లర్ సినిమాలే ఎక్కువ వస్తున్నాయ్ దానికి కారణం ఏమన్నా ఉందా?

‘మ‌ళ్లీరావా’ హిట్ అయిన త‌ర్వాత నాకు రొమాంటిక్ డ్రామా సినిమాలే ఎక్కువ‌గా వ‌స్తాయ‌ని అనుకున్నాను. కానీ ఎక్కువగా థ్రిల్ల‌ర్ సినిమాలే వ‌చ్చాయి. ఆడియెన్‌గా నాకు కూడా థ్రిల్ల‌ర్ సినిమాలే ఎక్కువ‌గా న‌చ్చుతాయి. అందుక‌నే ఏమో రీసెంట్ టైమ్‌లో ఎక్కువ‌గా థ్రిల్ల‌ర్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాను. ‘క‌ప‌ట‌ధారి’ విష‌యానికి వ‌స్తే.. నేను చేసిన థ్రిల్ల‌ర్స్ కంటే ఇది చాలా డిఫ‌రెంట్ మూవీ ‘కపటధారి’. సినిమాలో ఓ డిఫ‌రెంట్ మూడ్ క్యారీ అవుతుంది. క‌న్న‌డ సినిమా ‘కావ‌లుధారి’ చూశాను. సాధార‌ణంగా కొన్ని స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించేట‌ప్పుడు ఇలా షూట్ చేస్తార‌ని కూడా అనుకోలేదు. చాలా సింపుల్‌గా, డిఫ‌రెంట్‌గా కొన్ని స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌డం ఆ సినిమాలో గ‌మ‌నించాను.

ఇంతకీ ఈ సినిమా ఎలా ఉండబోతుంది?

సాధార‌ణంగా మ‌న సినిమాల్లో పోలీసుల‌ను హీరోలుగా చూసుంటాం. అయితే ట్రాఫిక్ పోలీసుల గురించి పెద్ద‌గా ఆలోచించం. కానీ జీవితంలో ఏదో సాధించాల‌నుకునే ఓ ట్రాఫిక్ ఎస్సై క‌థే ఈ ‘క‌ప‌ట‌ధారి’. ట్రైల‌ర్ చూసుంటే మీకు క‌థేంటో కాస్త అర్థ‌మై ఉంటుంద‌ని అనుకుంటున్నాను. ఎప్పుడో న‌ల‌బై ఏళ్ల క్రితం మూసేసి ప‌క్క‌న ప‌డేసిన కేసుకు సంబంధించిన ఆధారాలు దొరికిన‌ప్పుడు దీంట్లో ఎక్క‌డో తేడా జ‌రిగిందే అనే సందేహం హీరోకి వ‌స్తుంది. అతని పొజిషన్‌లో పెద్ద వాళ్లైన ఆఫీస‌ర్స్ వ‌ద్ద‌ని చెప్పినా కూడా విన‌కుండా కేసుని సాల్వ్ చేయ‌డానికి హీరో ప్ర‌య‌త్నించ‌డ‌మే సినిమా ప్ర‌ధాన క‌థాంశం. అయితే స్క్రీన్‌ప్లే డిఫ‌రెంట్‌గా ఉంటుంది. ఎక్క‌డా సినిమా ఎక్కువ‌గా డివీయేట్ కాదు. సాంగ్స్‌, కామెడీ, యాక్ష‌న్ అన్నీ ఓ ప‌రిమిత అవ‌ధుల్లో ఉంటాయి. సినిమా ఫోక‌స్డ్‌గా ఉంటుంది.

ఒరిజినల్ వెర్షన్ కి దీనికి మార్పులు ఏమన్నా ఉంటాయా.?

ఈ సినిమా న్యూ జోనర్ థిల్ల‌ర్ మూవీ. సినిమా కాస్త డార్క్ స్పేస్‌లో తెర‌కెక్కింది. క‌న్న‌డ వెర్ష‌న్‌లో సినిమా కాస్త స్లో స్పేస్‌లో ఉన్న‌ట్లు అనిపిస్తుంది. కానీ తెలుగులో స్పీడ్‌గా ఉంటుంది. ల్యాగ్స్ త‌గ్గించి షార్ప్ చేశాం.నేను ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన థ్రిల్ల‌ర్ చిత్రాల‌కు ‘క‌ప‌ట‌ధారి’ సినిమా పూర్తి భిన్న‌మైన చిత్రం. ఇదొక క్రైమ్ డ్రామా. ట్విస్టులు, స‌స్పెన్సులు అన్నీ ఉంటాయి.

ఇది అన్ని పోలీస్ డ్రామాల లానే ఉంటుందా లేక..?

నేను క‌మ‌ర్షియ‌ల్ పోలీస్ మూవీస్‌ను బాగా ఎంజాయ ఛేస్తాను. అయితే ఇది రెగ్యులర్ పోలీస్ కమర్షియల్ మూవీ కాదు. కాబ‌ట్టి నా పాత్ర‌ను హీరోయిక్‌గా చూపించాల్సిన అవ‌స‌రం లేదు. చాలా నేచుర‌ల్‌గా చేసుకుంటూ వెళ్లాం. యూనివ‌ర్స‌ల్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన చిత్రం కాబట్టి నెటివిటీ స‌మ‌స్య ఈ సినిమాలో క‌న‌ప‌డ‌దు.

ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్ చేశారు, బాగా లేట్ అయ్యినట్టు ఉందే.?

‘క‌ప‌టధారి’ షూటింగ్ గతేడాది ఫిబ్ర‌వ‌రికే పూర్త‌య్యింది. మార్చిలో విడుద‌ల చేద్దామ‌ని అనుకున్నాం. కానీ కోవిడ్ ప్ర‌భావం స్టార్ట్ అయ్యింది. దీంతో సినిమా విడుద‌లను దాదాపు ఏడాదిపాటు వాయిదా వేయాల్సి వ‌చ్చింది.

హీరోయిన్ నందిత శ్వేతా కోసం ఏమన్నా చెప్పండి

నందితా శ్వేత వండ‌ర్‌పుల్ ఆర్టిస్ట్‌. ఆమె న‌టించిన ‘ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా’ సినిమా చూశాను. ‘కపటధారి’ సినిమాలో నాకు స‌పోర్టింగ్ రోల్‌లో క‌నిపించింది నందిత‌. మా మ‌ధ్య డ్యూయెట్స్ ఏమీ ఉండ‌వు. ‘కావలుధారి’ సినిమా త‌న‌కు న‌చ్చింది. పాత్ర న‌చ్చ‌డంతో చిన్న పాత్ర‌గా అనిపించినా చేయ‌డానికి సిద్ధ‌మైంది నందితా శ్వేత‌.

ఎలాంటి సినిమాలు మీరు ఓకే చేస్తారు?ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి?

నేను యాక్ట‌ర్‌గా చాలా క‌థ‌లు వింటుంటాను. అయితే అన్ని క‌థ‌లకు నేను సూట్ అవుతాన‌ని అనుకోను. నెరేష‌న్ తొలి అర్థ‌గంటలోనే సినిమా నాకు సూట్ అవుతుందో లేదో క్లారిటీ వ‌చ్చేస్తుంది. ఒక‌వేళ నాకు ఆ క‌థ సూట్ కాక‌పోతే, ఎవ‌రికి ఆ క‌థ సూట్ అవుతుందో వారి ద‌గ్గ‌ర‌కి నేను ఆ క‌థ‌ను విన‌మ‌ని పంపిస్తాను.అలాగే ప్ర‌స్తుతం ‘అన‌గ‌న‌గా ఒక రౌడీ’ సినిమా చేస్తున్నాను. దాని త‌ర్వాత ఓ ప్రోగ్రెసివ్ రొమాంటిక్ డ్రామా చేస్తున్నాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు