ఇంటర్వ్యూ : రామ్ చరణ్ – సైరా 12సంవత్సరాలుగా నాన్న కంటున్న కల !

ఇంటర్వ్యూ : రామ్ చరణ్ – సైరా 12సంవత్సరాలుగా నాన్న కంటున్న కల !

Published on Aug 21, 2018 4:15 PM IST

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నర్సింహారెడ్డి చిత్రం యొక్క టీజర్ ఈ రోజు ఉదయం విడుదలైయింది. ఈ సంధర్బంగా చిత్ర నిర్మాత రామ్ చరణ్ మీడియా తో మాట్లాడారు ఇప్పుడు ఆ విశేషాలు మీ కోసం…

స్టైలిష్ చిత్రాలను తెరకెక్కించిన సురేందర్ రెడ్డి ని ఇలాంటి ఒక ఎపిక్ చిత్రానికి దర్శకుడిగా ఎంచుకోవడానికి గల కారణం ?

దర్శకడు అనే వాడు ఏ కథనైనా హ్యాండిల్ చేయగలడు. చెప్పాలంటే నా కాన్ఫిడెన్స్ కన్న సూరి ఈ ప్రాజెక్ట్ ను నేను తీయగలను అని చెప్పిన తరువాతే ఈ ప్రాజెక్ట్ చేయయడానికి ముందుకు వచ్చాను.

ఈ చిత్రానికి ఎంత బడ్జెట్ను కేటాయించారు ?

నేను ఆ నంబర్ ను రివీల్ చేయలేను (నవ్వుతూ). కానీ ఇది కచ్చితంగా పెద్డ బడ్జెట్ చిత్రమే. సైరా 12 సంవత్సరాలుగా నా తండ్రి కల. ఆయన 35సంవత్సరాల కేరీర్ లో ఇలాంటి చిత్రంలో నటించలేదు. నేను ఈచిత్రానికి ఎంత బడ్జెట్ పెట్టాను ఇది ఎంత కలెక్ట్ చేస్తుందనే విషయం కంటే ఇలాంటి ఒక చిత్రాన్ని నిర్మించే అవకాశం నాకు వచ్చినందుకు అదృష్టంగా భావిస్తున్నాను.

ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుదలచేయాలనుకుంటున్నారు ?

ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటిస్తాం.

ఎన్ని భాషల్లో ఈచిత్రాన్ని విడుదలచేయనున్నారు ?

అన్ని సౌత్ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం.

ఎందుకు ఈ టీజర్ లాంచ్ కు చిరంజీవి గారు హాజరుకాలేకపోయారు ?

నవ్వుతూ. ఒకవేళ ఆయన ఇక్కడికి వస్తే అందరికి చెప్పే వారు టీజర్ ను చూడమని ఇది ఒక సప్రైజ్ లాగా మేము ఆయన బర్త్ డే కు కానుకగా ఇచ్చాం.

టీజర్లో చివరి షాట్ కొదమసింహం సినిమాని గుర్తుచేసేలా ఉంది ఇది ఉద్దేశపూర్వకంగా చేశారా ?

నేను కూడా అదే ఫిల్ అయ్యాను. అది మా డైరెక్టర్ మరియు స్టంట్ మాస్టర్ ఐడియా కొదమసింహం నా ఫేవరేట్ మూవీ ఆ సినిమా చేసే హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను.

ఈ టీజర్ ను థియేటర్ లలో ప్రదర్శించడానికి ప్లాన్ చేస్తున్నారా ?

మేము ముందే ప్లాన్ చేశాం. ఒకేసారి నెట్ తో పాటు థియేటర్లో విడుదల చేద్దామని కాని జంతు సంరక్షక శాఖ నుండి అనుమతి రాలేదు. ఆల్రెడీ ప్రాసెస్ లో ఉంది. ఇంకో రెండు వారాల్లో వారి దగ్గర నుండి అనుమతి లభిస్తుంది. రాగానే టీజర్ ను థియేటర్లలో ప్రదర్శిస్తాం.

సైరా ఇప్పుడున్న బాక్సాఫిస్ రికార్డులను తిరగరాస్తుందా ?

సైరా అన్ని రికార్డులను బ్రేక్ చేయాలనే కోరుకుంటున్నాను. ఎందుకంటే దానివల్ల ఇండస్ట్రీ కి చాలా లాభం జరుగుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు