ఇంటర్వ్యూ : శ్రీవాస్ – నా కొడుకును నిలబెట్టావు అని ఆవిడ చాలా ఎమోషనల్ అయ్యారు !

ఇంటర్వ్యూ : శ్రీవాస్ – నా కొడుకును నిలబెట్టావు అని ఆవిడ చాలా ఎమోషనల్ అయ్యారు !

Published on Jul 28, 2018 6:40 PM IST

శ్రీవాస్ దర్శత్వంలో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ , పూజా హెగ్డే జంటగా అభిషేక్ పిక్చర్స్ పతాకం ఫై అభిషేక్ నామ నిర్మించిన చిత్రం ‘సాక్ష్యం’. ఈనెల 27 న ఈచిత్రం ప్రేక్షకులముందుకు వచ్చింది. ఈ సంధర్బంగా ఈ చిత్ర దర్శకుడు శ్రీవాస్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం..

సినిమా రెస్పాన్స్ ఎలా ఉంది సర్ ?
సినిమా గురించి రెస్పాన్స్ చాలా బాగుంది. ప్రేక్షకులందరూ కూడా సినిమా కొత్తగా ఫీల్ అయ్యాం అని చెప్తున్నారు. సినిమాలో ముఖ్యమైన సన్నివేశాలకు, యాక్షన్ సన్నివేశాలకు మంచి స్పందన వస్తోంది. సినిమా ఓపెనింగ్స్ కూడా బాగున్నాయి.

అసలు ఈ థాట్ ఎలా వచ్చింది ?
జనరల్ గా కొత్త కొత్త కాన్సెప్ట్ లతో సినిమా చెయ్యాలని నా కోరిక. ఆ ఉద్దేశంలో ఉన్నప్పుడే ఈ మూవీకి సంబంధించిన థీమ్ నాకు ఫస్ట్ ఐడియాలా వచ్చింది. అసలు ఈ పాయింట్ ఇదివరకు ఎక్కడైనా వచ్చిందా ? అని అంతా చూసుకొని ఎక్కడా ఈ పాయింట్ మీద సినిమా రాలేదు అనుకున్న తర్వాత ఈ సినిమా కథ మీద వర్క్ చెయ్యటం జరిగింది.

ఈ భారీ బడ్జెట్ సినిమాకు పెద్ద హీరోలతో వెళ్లొచ్చు కదా ? ఎందుకు బెల్లండకొండ శ్రీనివాస్ తోనే చేశారు ?
పెద్ద హీరోలు అంటే వాళ్ళ ఫ్యాన్స్ మా హీరో ఇలానే ఉండాలి ? సినిమాలో మొత్తం మా హీరోనే ఉండాలి ఇలాంటి సమస్యలు వస్తాయి. అయినా నేను పెద్ద హీరోలు కోసం ట్రే చెయ్యలేదు. కానీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చాలా బాగా చేశాడు. మంచి కసితో పని చేశాడు.

ఈ సినిమాలో వాల్మీకి పాత్రలో అనంత్ శ్రీ రామ్ ను తీసుకోవడానికి కారణం ఏమిటి ?
వాల్మీకి పాత్రలో రెగ్యులర్ ఆర్టిస్టు కాకుండా నాచ్యురల్ గా అచ్చం ఒక రైటర్ లా ఉండాలి అనుకున్నాము.అంటే ఆ పాత్ర ఒక పాసింగ్ క్లవ్డ్ లా ఉండాలి. అనంత్ శ్రీ రామ్ నాకు దగ్గరగా ట్రావెల్ అవ్వటం వల్ల, తను చేస్తే బాగుంటుంది కదా అనిపించి చివరికి తననే పెట్టడం జరిగింది.

అసలు ఈ సినిమా గురించి చెప్పండి ?
ఫ్యామిలీతో సరదాగా ఏ అరుపులు గోళాలు లేని థియేటర్లోకి వెళ్లి ఈ సినిమా చూడండి. ఖచ్చితంగా మీరు కొత్తగా ఫీల్ అవుతారు. మీకు మూవీ చాలా బాగా నచ్చుతుంది.

సినిమాలో వైలెన్స్ మరి ఎక్కువుగా ఉందని అంటున్నారు ? దీనికి మీరు ఏం చెప్తారు ?
నేను వైలెన్స్ అనుకోని తీయలేదు. ఓ సెంటిమెంట్ అనుకోని తీసాను. ఓ నేచర్ పగ బట్టాలంటే జరగకూడని సంఘటనలు జరగాలి. విలన్స్ అంత దారుణంగా వైలెన్స్ చేస్తేనే, నేచర్ రివైంజ్ తీర్చుకుంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తోనే అంత వైలెన్స్ పెట్టడం జరిగింది.

మీ కొత్త సినిమాలు గురించి చెప్పండి ? తర్వాత సినిమా ఎవరితో ప్లాన్ చేస్తున్నారు ?
ఎప్పుడు ఒకే టైపు సినిమాలు చెయ్యటం నాకు ఇష్టం ఉండండి. లక్ష్యం దగ్గర నుంచి ఇప్పటివరకు నేను చేసిన సినిమాలు మీరు చూస్తే ఆ విషయం మీకే అర్ధమవుతుంది. అయితే ప్రస్తుతం నా దగ్గర ఓ కూడా రకం కథ ఉంది. అస్సలు ఫైట్స్ లేని ఓ డిఫరెంట్ పాయింట్ ఉన్న కథ అది. దాన్ని ఖచ్చితంగా సినిమాగా చేస్తా. కానీ పరిస్థితులని బట్టి, హీరోల డేట్లును బట్టే నా తర్వాత సినిమా ఉంటుంది.

హీరోని బాగా కష్టపెట్టినట్లు ఉన్నారు ?
తను నిజంగా చాలా బాగా చేసాడు. మీరు సినిమాలో చూస్తే తాను ఇంట్రడక్షన్ సీన్ లో కానీ యాక్షన్ సీన్స్ లో ఎంతో రిస్క్ చేసి మరి సాయి శ్రీనివాస్ యాక్ట్ చేశాడు.

బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ గురించి చెప్పండి ?
బుర్రా సాయి మాధవ్ గారి డైలాగ్స్ ఈ సినిమాకి చాలా బాగా హెల్ప్ అయ్యాయి. ఆయన చాలా బాగా రాశాడు. మేం చాలా సబ్జెక్ట్ అనుకున్నా ఆయన చాలా సింపుల్ గా డైలాగ్ రూపంలో చాలా చక్కగా రాశారు.

ఈ సినిమాకు మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏమిటి ?
మా హీరో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ తల్లిగారి దగ్గరనుంచి నేను ఈ సినిమాకు బెస్ట్ కాంప్లిమెంట్ అందుకున్నాను. ఆవిడ సినిమా చూసి ఏడ్చుకుంటూ ఒకరకంగా చెప్పాలంటే చాలా ఎమోషనల్ అయిపోయి నా కొడుకును నిలబెట్టావు అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా అలాగే ఫీల్ అయ్యారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు