ఇంటర్వ్యూ: సుమంత్ శైలేంద్ర – అల్లు అర్జున్ ఆర్య చూశాకే హీరో ఆవాలనుకున్నాను !

Published on Jul 31, 2018 4:09 pm IST

ఈటివి ప్రభాకర్ దర్శకత్వంలో సుమంత్ శైలేంద్ర, ఇషా రెబ్బ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘బ్రాండ్ బాబు’. శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని శైలేంద్ర బాబు నిర్మించారు. కాగా ప్రముఖ దర్శకుడు మారుతీ ఈ చిత్రానికి కథ అందించడం విశేషం. ఈ చిత్రం ఆగష్టు 3న ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ గా విడుదలకాబోతుంది. ఈ సందర్బంగా ఈ చిత్ర హీరో సుమంత్ శైలేంద్ర, మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీ కోసం..

ఈ సినిమా గురించి చెప్పండి ?

తెలుగులో నా డెబ్యూ మూవీకి ఈ చిత్ర కథ చాలా యాప్ట్ అవుతుంది. మంచి కమర్షియల్ అంశాలతో ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే పక్కా మారుతిగారి బ్రాండ్ ఇది. మహానుభావుడు, భలే భలే మగాడివోయి చిత్రాల శైలిలోనే ఈ చిత్రం కూడా సాగుతుంది. మారుతిగారిని రెండు మూడు సంవత్సరాలనుంచి అడుగుతున్నాను. కొన్ని కారణాల వల్ల మా కాంబినేషన్ లెట్ అయింది. ఫైనల్ గా బ్రాండ్ బాబుతో మీ ముందుకు వస్తున్నాం.

మీరు కన్నడాలో నాలుగు సినిమాల్లో హీరోగా చేశారు. మరి బ్రాండ్ బాబు కూడా అక్కడ రిలీజ్ అవుతుందా ?
లేదు అండి. కన్నడాలో ఏం రిలీజ్ అవ్వదు. ఈ సినిమా ఓన్లీ తెలుగులో మాత్రమే రిలీజ్ అవుతుంది.

మీరు అక్కడ బిజీ యాక్టర్ కదా. మరి ఎందుకు తెలుగులో మాత్రమే ఫోకస్ చేస్తున్నారు ?

తెలుగు ప్రేక్షకులు మంచి అభిరుచిగలవారు. మిగిలిన లాంగ్వేజ్ ప్రేక్షకులతో పోల్చుకుంటే. తెలుగు ప్రేక్షకులు కొత్త టాలెంట్ ను ఎప్పుడు ప్రోత్సాహిస్తారు. అదికాక తెలుగు సినిమా విడుదలవుతుంటే ఓ పండగ వాతావరణం ఉంటుంది. అంతలా ఇక్కడ సినిమాను ప్రేమిస్తారు. అన్నిటికి మీంచి (నవ్వుతూ) తెలుగు చాలా పెద్ద మార్కెట్ కదా. అయినా తెలుగులో ఎప్పటినుంచో సినిమా చెయ్యాలని అనుకుంటున్నాను.

మీ గురించి చూపండి ?

మా ఫాదర్ శైలేంద్ర బాబు నిర్మాత అని మీకు తెలిసిన విషయమే. ఆయన శివ రాజ్ కుమార్, ఉపేంద్ర లతో సినిమాలు తీశారు. దాదాపు 30 సంవత్సరాల నుండి ఆయన సినీ నిర్మాణంలో ఉన్నారు.

మీరు హీరో అవ్వటానికి ప్రేరణ ఎవరు ?

నో డౌట్ బన్నీగారు అండి. ఆయన ఆర్య సినిమా చూసి నేను చాలా మారాను. ఎలాగైనా హీరో అవ్వాలని అప్పుడే ఫిక్స్ అయ్యాను. నాకిప్పటికీ అల్లు అర్జున్ గారే ప్రేరణ.

బన్నిగారిని ఎప్పుడైనా కలిసారా ?

రెండు మూడు సార్లు కలిసాను. మాట్లాడాను కూడా. ఆయన చాలా గొప్ప వ్యక్తి. అందరితోనూ సరదాగా ఉంటారు. నాకు బన్నిగారి బ్రదర్ అల్లు శిరీష్ చాలా బాగా క్లోజ్.

ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది ?

పాత్ర గురించి పూర్తిగా ఇప్పుడేం చెప్పలేను గాని, ఈ సినిమా చూశాకా నా పాత్ర చాలామందికి కనెక్ట్ అవుతుంది. చిన్న వస్తువులను క్కూడా బ్రాండ్ ఉండాలనే కోరుకున్న క్యారెక్టర్ లో నేను నటించాను. ఇలాంటి క్యారెక్టర్ ఉన్న ఓ కుర్రాడి లైఫ్ లోకి ఏ బ్రాండ్ లేని తెలియని ఓ టీ స్టాల్ అతని కూతురు వస్తోంది. ఆ అమ్మాయి వచ్చాకా అతను రియాక్షన్ ఏంటి ? చివరకి ఏమైంది అనేదే సినిమా.

ఈ చిత్ర దర్శకుడు ప్రభాకర్ తో మీ వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి చెప్పండి ?

ప్రభాకర్ గారు నిజంగా అమేజింగ్ అండి. ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఆల్ రౌండర్ అని చెప్పొచ్చు. ఆయన డైరెక్టర్, యాక్టర్, యాంకర్, డాన్సర్ ఇలా ఆయనకు సినిమాలో ప్రతి క్రాఫ్ట్ గురించి తెలుసు. చాలా సంవత్సరాల నుంచి పరిశ్రమలో ఉండటం వల్ల ఎవరితో ఎలా పని చేయించుకోవాలో ఆయనకు బాగా తెలుసు. ఇక ఆయనతో పని చెయ్యడం చాలా ప్లజంట్ గా అనిపించింది. సినిమాలో నా పాత్ర ఎలా ఉండాలి ఎలా బిహేవ్ చెయ్యాలి ఇలా ప్రతిది ఆయన ఎంతో కేర్ తీసుకుని చేశారు. ఆయనకు మారుతిగారు కూడా ఎంతో సహాయ సహకారాలు అందించారు.

సినిమా గురించి మారుతిగారు ఏమన్నారు ?

నాకు తెలిసి మారుతిగారు సెట్ కి ఎనిమిది సార్లు వచ్చారనుకుంటా. ఒక రోజు అయితే డైరెక్షన్ కూడా చేశారు. ప్రభాకర్ గారి ఓ పర్సనల్ ప్రాబ్లమ్ వల్ల ఒక రోజు షూట్ కి హాజరుకాలేకపోయారు. దాంతో సినిమాలో చాలా కీలకమైన ఇంటర్వెల్ సీన్ ను మారుతిగారే డైరెక్ట్ చేశారు.

మారుతి గత చిత్రాలు మహానుభావుడు, భలే భలే మగాడివోయి చిత్రాలకి, బ్రాండ్ బాబు చిత్రానికి ఏమైనా పోలికలు ఉంటాయా ?

అలా ఏం ఉండదండి. కాకపొతే ఆ చిత్రాల లాగే క్యారెక్టర్ బేస్డ్ తోనే ఈ చిత్రం కూడా నడుస్తోంది. కానీ ఈ చిత్రంలో క్యారెక్టర్ పూర్తిగా వేరు, ఆ కారణంగా ఆ చిత్రాలకి ఈ చిత్రానికి అస్సలు సంబంధం లేదని చెప్పొచ్చు. అదికాక ముఖ్యంగా బ్రాండ్ బాబులో తండ్రి కొడుకుల మధ్య మంచి ఎమోషనల్ సన్నివేశాలు ఉంటాయి. అవి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతాయి.

సంబంధిత సమాచారం :