ఇంటర్వ్యూ : వెంకటేష్ – డిఫరెంట్ గా ట్రై చేసిన ప్రతిసారి ఆడియన్స్ నన్ను ప్రోత్సహించారు.

ఇంటర్వ్యూ : వెంకటేష్ – డిఫరెంట్ గా ట్రై చేసిన ప్రతిసారి ఆడియన్స్ నన్ను ప్రోత్సహించారు.

Published on Jul 7, 2014 3:13 PM IST

Venkatesh-(124)

టాలీవుడ్ టాప్ నలుగురు హీరోల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎక్కువగా కుటుంబ కథా చిత్రాల్లో నటించి అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆకట్టుకున్న వెంకటేష్ ఈ వారం మరో సస్పెన్స్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘దృశ్యం’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సందర్భంగా వెంకటేష్ తో కాసేపు ముచ్చటించాం. దృశ్యం గురించి, తన రాబోవు సినిమాల గురించి వెంకటేష్ చెప్పిన పలు విశేషాలు మీ కోసం..

ప్రశ్న) ‘దృశ్యం’ రిలీజ్ కోసం మీరు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు?

స) ఈ సినిమా రీమేక్ చేయాలి అనుకున్న రోజు నుంచి ఈ రోజుటి వరకు నేను చాలా ఆసక్తిగా ఉన్నాను. ఎందుకంటే అందరికీ నచ్చేలా మాత్రమే కాకుండా ఓ కొత్త అపాయింట్ ని చూపించి థ్రిల్ చేసే కథలు చాలా అరుదుగా దొరుకుతుంటాయి. ఈ సినిమా విషయంలో ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారా అని రిలీజ్ కోసం చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాను.

ప్రశ్న) ఈ సినిమాలో మీరు పోషించిన రాంబాబు పాత్ర గురించి చెప్పండి?

స) మీరన్నట్టు నా పాత్ర పేరు రాంబాబు, ఓ కేబుల్ ఆపరేటర్ గా సినిమాలో కనిపిస్తాను. చాలా సింపుల్ గా ఉంటూ నిజాయితీగా సంపాదించుకునే వ్యక్తి. కానీ అతని లైఫ్ ని ఒక చిన్న సందర్భం కుదిపేస్తుంది. అలాంటి సందర్భంలో అతను ఎలా ఆ సందర్భాన్ని డీల్ చేసాడు అనేదే మీరు తెరపై చూస్తారు.

ప్రశ్న) ఇందులో టీనేజ్ కుమార్తెకి ఫాదర్ గా చేసారు. హీరో నుండి ఒక మిడిల్ ఏజ్ పాత్ర చేయడం ఎలా అనిపించింది?

స) చూడండి.! నేను సినిమాలు చేయడం మొదలు పెట్టి చాలా సంవత్సరాలైంది. ఇప్పుడు ఇలాంటి ఓ మెచ్యూర్ పాత్ర చేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇకముందు కూడా ఇలాంటి పాత్రలు వస్తే చేస్తాను.

ప్రశ్న) మలయాళం దృశ్యం ఎప్పుడు చూసారు? అలాగే ఈ సినిమా రీమేక్ చేయాలని మీకు అనిపించిన పాయింట్ ఏమిటి?

స) నేను ఎప్పుడైతే ఈ సినిమా చూసానో అప్పుడు ఆ స్క్రిప్ట్ కి బాగా కనెక్ట్ అయ్యాను. ఈ సినిమాలో వచ్చే ఎమోషన్స్ నాకు బాగా కనెక్ట్ అయ్యాయి. అవే నన్ను ఈ సినిమా చేసేలా చేసాయి.

ప్రశ్న) మీరు ఇందులో మొహన్ లాల్ పాత్ర చేసారు. మరి మీరు ఈ సినిమా గురించి మోహన్ లాల్ తో ఎప్పుడన్నా చర్చించారా?

స) అవును.. నేను పర్సనల్ గా మోహన్ లాల్ ని కలిసి ఈ సినిమా గురించి చర్చించాను. మోహన్ లాల్ చాలా హ్యాపీగా ఫీలవ్వడమే కాకుండా ఈ పాత్రకి నేనైతేనే పర్ఫెక్ట్ గా సరిపోతానని ఫీల్ అయ్యాడు.

ప్రశ్న) మీకు స్పూర్తిదాయకమైన కమల్ హాసన్ ఈ సినిమాని తమిళ్ లో చేస్తున్నారు. ఆయన నుంచి ఏమన్నా సూచనలు తీసుకున్నారా?

స) కమల్ హాసన్ కి ఎప్పుడైతే నేను ఈ సినిమా చేస్తున్నానని తెలిసిందో అప్పుడు నాకు కాల్ చేసి ఈ సినిమా చేస్తున్నందుకు కంగ్రాజ్యులేట్ చేసారు. అలాగే ఇలాంటి డిఫరెంట్ సినిమాలు ముందు ముందు కూడా చేయాలని ఎంకరేజ్ చేసారు.

ప్రశ్న) చాలా రోజుల తర్వాత మళ్ళీ మీనాతో పనిచేయడం ఎలా ఉంది?

స) మీనాతో నాకు ఇది ఐదవ సినిమా. తనతో పనిచేయడం చాలా బాగుంటుంది. ఈ సినిమాలో తన పెర్ఫార్మన్స్ తో అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది.

ప్రశ్న) మీరు కమర్షియల్ హీరో నుంచి మెచ్యూర్ ఫాదర్ రోల్స్ వైపు వచ్చేశారు. ఈ మార్పుని ఆడియన్స్ స్వాగతిస్తారని మీరనుకుంటున్నారా?

స) లక్కీ అయిన విషయం ఏమిటంటే నేను ఎప్పుడు డిఫరెంట్ గా ట్రై చేసిన ప్రతిసారి ఆడియన్స్ ప్రోత్సహించారు. ఇప్పుడు దృశ్యం సినిమా వాళ్ళకి నచ్చడమే కాకుండా ఇలాంటి డిఫరెంట్ సినిమాలు చేయాలని నన్ను ఎంకరేజ్ చేస్తారు.

ప్రశ్న) లేడీ డైరెక్టర్ శ్రీ ప్రియతో పనిచేయడం ఎలా ఉంది? ఆమెతో పనిచేయడంలో మీరు ఏమన్నా ఇబ్బంది పడ్డారా?

స) నాకు శ్రీ ప్రియతో పనిచేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. శ్రీ ప్రియ స్వతహాగా తనొక నటి, టెలివిజన్ లో కూడా నటించింది. అందరినీ ఇంప్రెస్ చేసేలా సినిమా చాలా బాలెన్స్ గా తీసింది.

ప్రశ్న) చాలా రోజుల తర్వాత మల్టీ స్టారర్ ట్రెండ్ ని స్టార్ట్ చేసారు. మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు మరో మల్టీ స్టారర్ లో చూడొచ్చు?

స) నేను ఎప్పుడు మల్టీ స్టారర్స్ చేయడానికి సిద్దమే, నా దగ్గరికి వచ్చిన ఆసక్తికర స్క్రిప్ట్స్ ని చేసాను. మళ్ళీ నాదగ్గరికి డీసెంట్ స్క్రిప్ట్ వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను.

ప్రశ్న) మరి బుల్లితెర పరిస్థితి ఏమిటి, టెలివిజన్ లో కనిపించడానికి ఏమనా ప్లాన్స్ చేసుకుంటున్నారా?

స) ప్రస్తుతానికి అయితే ఆ విషయంపై నో ఐడియా.. ఒకవేళ నన్ను బాగా ఎగ్జైట్ చేసేలా ఏదైనా ఆఫర్ వస్తే చెయ్యడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు.

ప్రశ్న) ‘గోపాల గోపాల’ ఎలా జరుగుతుందో చెప్పండి?

స) చాలా బాగా తెరకెక్కుతోంది. ప్రస్తుతానికి నా పార్ట్ కి సంబదించిన షూటింగ్ చేస్తున్నాను, త్వరలో పవన్ కళ్యాణ్ జాయిన్ అవుతాడు. మా ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ ని బాగా రాసారు. మా ఇద్దరి కాంబినేషన్ ప్రేక్షకులకి బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను.

ప్రశ్న) రాష్ట్ర విభజన తర్వాత ఇండస్ట్రీ కూడా డివైడ్ అయిపోవాలని ఫిల్మ్ చాంబర్ లో చర్చలు జరుగుతున్నాయి. దానిపై మీ కామెంట్.?

స) ఇదొక కష్టమైన సందర్భం. నటులుగా మేము ఈ విషయం గురించి పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు అలాగే ప్రతి ఒక్కరితో చర్చించాల్సిన అవసరం కూడా లేదు. కొత్తగా చాంబర్స్ ఏర్పడితే కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కానీ వాటిని కూడా పరిష్కరించుకునే మార్గాలు ఉంటాయని ఆశిస్తున్నాను. అలాగే త్వరలో ఈ విషయంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ప్రశ్న) చివరిగా దృశ్యం ఎలా ఉంటుందో మా పాఠకులకి చెప్పండి?

స) స్ట్రాంగ్ స్క్రిప్ట్, సూపర్బ్ పెర్ఫార్మన్స్ మరియు అందరికీ కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ తో తెరకెక్కిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘దృశ్యం’. ప్రతి ఒక్కరూ ఇలాంటి సినిమాలను చూసి ఇలాంటి డిఫరెంట్ స్టోరీస్ మరిన్ని వచ్చేలా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను.

అంతటితో ‘దృశ్యం’ సినిమా పెద్ద హిట్ అవ్వాలని వెంకటేష్ కి ఆల్ ది బెస్ట్ చెప్పి మా ఇంటర్వ్యూని ముగించాం..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు