ఇంటర్వ్యూ: ఆదర్శ్ బాలకృష్ణ- కెజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నాకు కజిన్..!

Published on May 15, 2020 8:06 pm IST

మన లాక్ డౌన్ సిరీస్ లో విలన్ రోల్స్ తో పాటు అనేక చిత్రాలలో ప్రాముఖ్యం ఉన్న పాత్రలు చేసిన యాక్టర్ ఆదర్శ్ బాలకృష్ణను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ విశేషాలు ఏమిటో చూద్దాం

లాక్ డౌన్ సమయంలో ఏమి చేస్తున్నారు?

ప్రస్తుతం అమ్మవాళ్లతో ఉంటున్నాను. మంచి శరీరాకృతి కోసం వ్యాయామం చేస్తున్నాను. అలాగే కొన్ని స్క్రిప్ట్స్ కూడా రాస్తున్నాను.

మీరు డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నారా?

లేదు… నాకు రైటింగ్ అంటే ఇష్టం. కొన్నాళ్లుగా నా బ్లాగ్ కొరకు కొన్ని స్క్రిప్ట్స్ రాస్తున్నాను. నా ఫస్ట్ ప్రయారిటీ అండ్ ఫోకస్ యాక్టింగ్ పైనే.

ప్రస్తుతం మీరు చేస్తున్న సినిమాలు ఏమిటీ?

కృష్ణ వంశీ గారి రంగ మార్తాండ మరియు కలర్ ఫోటో సినిమాలో నటిస్తున్నాను. అలాగే నాని నటించిన వి మూవీలో ఓ పాత్ర చేశాను. ఉరి మూవీ ఆధారంగా తెరకెక్కిన హింది వెబ్ సిరీస్ లో కూడా నటించడం జరిగింది.

బిగ్ బాస్ షో లో మీరు చాలా ఎమోషనల్ కావడం చూశాను, అదంతా నిజమేనా?

అవును అదంతా నిజంగా జరిగింది. హౌస్ లో ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వుంటారు. అక్కడ హౌస్ మేట్స్ ని గైడ్ చేయడానికి స్క్రిప్ట్ ఏమి ఉండదు. కాకపోతే హౌస్ లోని పరిస్థితుల ఆధారంగా మేకర్స్ ఆసక్తికరంగా ప్లాన్ చేస్తారు.

మీ నాన్నగారు కూడా నటుడు అనుకుంటాను?

చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే కెజిఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నాకు కజిన్ అవుతారు. అలా కెజిఫ్ లో నాన్నగారికి ఆయన ఓ రోల్ ఆఫర్ చేయడం జరిగింది. కెజిఫ్ 2లో కూడా ఓ రోల్ చేస్తున్నారు ఆయన. కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా నటించారు.

ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు?

నాకు అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. ఒక నటుడిగా ఛాలెంజింగ్ రోల్స్ చేయాలి. వెర్సిటైల్ యాక్టర్ అనిపించుకోవాలి.

మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమిటీ?

ప్రస్తుతం రెండు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నాను. అందులో ఒకటి ఆహా కొరకు మిక్స్ అప్ అనే అర్బన్ రొమాన్స్ నేపథ్యంలో తెరకెక్కుతుంది.

 

సంబంధిత సమాచారం :

X
More