ఇంటర్వ్యూ: వెంకట్-బన్నీ నటన చిరంజీవిని గుర్తు చేసింది.

Published on Jun 2, 2020 1:08 pm IST

లాక్ డౌన్ ఇంటర్వ్యూ సిరీస్ లో నేడు నటుడు వెంకట్ ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి హింట్ అందుకున్న వెంకట్ అనేక సినిమాలలో ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేశారు. ఈ మధ్య సినిమాలకు కొంచెం బ్రేక్ ఇచ్చిన ఆయన ఓ టి టి లో వరుసగా ప్రాధాన్యం ఉన్న రోల్స్ చేస్తున్నారు. మరి ఆయన గురించి తాజా సంగతులు అడిగి తెలుసుకుందా…

 

రన్ మూవీ కి వస్తున్న రెస్పాన్స్ ఎలా ఉంది?

రన్ డీసెంట్ రెస్పాన్స్ దక్కించుకుంటుంది. ఫ్రాంక్ గా చెప్పాలంటే కొందరు బాగుంది అంటుంటే, మరి కొందరు ఇంకా బాగా చేయాల్సింది అంటున్నారు. మెల్లగా రన్ మూవీ చూస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది.

 

మీకు ఈ అవకాశం ఎలా వచ్చింది?

క్రిష్ మరియు రాజీవ్ రెడ్డి ఈ పాత్ర కోసం నన్ను సంప్రదించారు. కథ అందులోని నాపాత్ర నచ్చింది. ఇక ఇది అల్లు అరవింద్ గారి ఆహా కొరకు అని తెలిసి వెంటనే ఒప్పుకున్నాను. అన్నయ్య సినిమా అప్పటి నుండి చిరంజీవి, అల్లు అరవింద్ తో మంచి అనుబంధం ఉంది.

 

ఎందుకు ఇంత విరామం తీసుకున్నారు?

గుర్తింపు లేని పాత్రలు చేసి చేసి నేను విసిగిపోయాను. అందుకే అవకాశాలు తగ్గినా కేవలం ప్రాధాన్యం ఉన్న పాత్రలే చేయాలని నిర్ణయించుకున్నాను.

 

అందుకే ఓ టి టి ప్లాట్ ఫార్మ్ ని ఎంచుకున్నారా?

అవును. ఓ టి టి ప్రభావంతో సినిమా మేకింగ్ లో చాలా మార్పులు వచ్చాయి. థియేటర్ రిలీజ్ లో ఓపెనింగ్ కలెక్టన్స్ టెన్షన్స్ ఉంటాయి. ఇక్కడ అలా కాదు, అందరూ చూసే అవకాశం ఉంటుంది. ఇక ఓ టి టి లో సాలిడ్ కంటెంట్ తో మంచి సినిమాలు, సిరీస్ లు తెరకెక్కుతున్నాయి. అందుకే కమ్ బ్యాక్ కి మంచి వేదిక అని భావించాను.

 

మీరు సోషల్ మీడియాలో కనిపించరు, కారణం?

సోషల్ మీడియాలో విషయాల పట్ల స్పందించడం, వ్యక్తిగత విషయాలు పంచుకోవడం నేను ఇష్టపడను. ఇక కెరీర్ పరంగా కూడా పెద్ద బ్యానర్ అయినా ప్రాధాన్యం లేని రోల్స్ చేయకూడదు అని నిర్ణయించుకున్నాను. అంతకు మించి నా ఓన్ బిజినెస్ లో నేను బిజీగా ఉండడానికి ఇష్టపడతాను.

 

ఈ మధ్య కాలంలో మిమ్ముల్ని ఇన్స్ఫైర్ చేసిన హీరో?

ఇటీవల నేను అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో మూవీ చూశాను. ఆ మూవీలో నటన మరియు డాన్స్ ల పరంగా బన్నీ పరిపక్వత చూసి ఆశ్చర్యం వేసింద. బన్నీ నటన చిరంజీవిని గుర్తు చేసింది.

 

ఫ్యూచర్ ప్రాజెక్ట్స్?

ప్రస్తుతం నేను మూడు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నాను. వాటిలో ఒకటి నన్ను హీరోగా పరిచయం చేసిన నాగార్జున గారి అన్నపూర్ణ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నారు. ఇక సుశాంత్ హీరోగా తెరకెక్కుతున్న ఇచ్చట వాహనములు నిలుపరాదు మూవీలో మంచి రోల్ చేస్తున్నాను.

సంబంధిత సమాచారం :

More