ఇంటర్వ్యూ: అనిల్ రావిపూడి- ఫ్యాన్స్ కి కావలసిన అన్ని అంశాలు ఉంటాయి

Published on Jan 8, 2020 1:13 pm IST

సూపర్ స్టార్ మహేష్ ని ఈ సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ అనే రేంజ్ లో చూపిస్తానంటున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ ఎంటర్టైనింగ్ చిత్రాల దర్శకుడు గత సంక్రాంతికి ఎఫ్ 2 చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇక ఈ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈనెల 11న చిత్ర విడుదల నేపథ్యంలో అనిల్ మీడియా సమావేశంలో పాల్గొని చిత్ర విశేషాలు పంచుకున్నారు.

 

సరిలేరు నీకెవ్వరు ఎలాంటి సినిమా..?

కామెడీ, ఎమోషన్స్ ,దేశభక్తి, విలువలు అన్ని కలగలిసిన ఒక ఫుల్ మీల్ లాంటి సినిమా ఇది. సంక్రాంతి పండుగ రోజు భోజనం ప్లేట్ లో ఎలాగైతే అన్ని వంటకాలు ఉంటాయో.. అలా అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి.

 

ఇంత తక్కువ సమయంలో మూవీ ఎలా పూర్తి చేశారు?

నేను ప్రతి సినిమా చిత్రీకరణకు బౌండ్ స్క్రిప్ట్ తో వెళతాను, అలాగే నిర్మాత అనిల్ సుంకర గారు, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్ సహకారంతో ఐదు నెలలో ఈ మూవీ పూర్తి చేశాను. ఇది టీమ్ ఎఫ్ఫార్ట్.

 

ఈ సినిమా ఎలా కార్య రూపం దాల్చింది?

ఎఫ్2 సినిమా చేసేటప్పుడే నా దగ్గర ఒక స్టోరీ లైన్ సిద్ధంగా ఉండటంతో మహేష్ గారికి వినిపించాను. దానికి ఆయన ఇంప్రెస్ అయ్యారు. ఈ కథలో ఓ మ్యాజిక్ ఉందని నమ్మి ఈ సినిమా ఒప్పుకున్నారు.

 

మహేష్ క్యారక్టర్ ఎలా ఉంటుంది?

ఒక బోర్డర్ లో పనిచేసిన ఆర్మీ సోల్జర్ సోషల్ లైఫ్ లో ఎలా ఉంటాడు తన చుట్టూ ఉన్న ప్రజలు చేసే తప్పులను ఎలా తీసుకుంటాడు అనే పాయింట్ ఆధారంగా ఈ చిత్రంలో మహేష్ పాత్ర ఉంటుంది. మీకోసం అక్కడ ప్రాణాలు అర్పిస్తుంటే, మీరు బాధ్యత లేకుండా ఉంటారా అని ప్రశ్నించే విధంగా ఉంటుంది.

 

కర్నూల్ నేపధ్యం అంటున్నారు..ఫ్యాక్షన్ ఛాయలు ఉంటాయా..?

ఈ చిత్రంలో ఫ్యాక్షనిజం ఉండదు. మహేష్, విజయ శాంతి, ప్రకాష్ రాజ్ అనే ముగ్గురు వ్యక్తుల మధ్య ప్రధానంగా నడిచే కథ ఇది.

 

మీకు బ్లాక్ బస్టర్ అందించిన ఎఫ్ 2 చిత్రం గురించి ఏమి చెవుతారు?

ఎఫ్ 2 మూవీ నా జీవితంలో గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నన్ను ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గిర చేసిన చిత్రం అది.

 

మహేష్ లాంటి స్టార్ యాక్టర్ తో పనిచేయడం ఎలా అనిపించింది?

మహేష్ గారిలో ఉన్న గొప్ప లక్షణం ఆయన త్వరగా కలిసిపోతారు. సెట్స్ లో జోక్స్ వేస్తారు. అందరితో సరదాగా ఉంటారు.మానిటర్ దగ్గర ఉన్న డైరెక్టర్ ని గమనిస్తూ దర్శకునికి కావలసిన అవుట్ ఫుట్ వచ్చే వరకు చేస్తారు.

 

విజయ శాంతి గారిని ఎలా ఒప్పించారు?

13 ఏళ్ల తరువాత విజయ శాంతి గారు ఈ సినిమా చేశారు. మొదట ఆమె సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. ఐతే కథ వినండి నచ్చకపోతే వదిలేద్దాం అని చెప్పాను. ఐతే కథ విన్న తరువాత ఆమె అంగీకరించారు. సినిమాకు వన్ ఆఫ్ ది హైలెట్ విజయ శాంతి. ఆమె కోసమే ఈ పాత్ర రాశాను.

 

ఈ సినిమా ఫ్యాన్స్ కోసమే చేశారా?

ఫ్యాన్స్ కోసం కాదు, పర్ఫస్ కోసం తీశాం.. ఐతే ఫ్యాన్స్ కి కావలసిన అన్ని అంశాలు ఈ చిత్రంలో వున్నాయి. చివరి 15 నిముషాలు సినిమాకు ప్రాణం.

 

మీకు ఇష్టమైన దర్శకులు ఎవరు?

జంధ్యాల గారు నాకు ఇష్టమైన దర్శకులు, ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. మేనరిజం తో కామెడీ పుట్టించడం పరిశ్రమకు నేర్పింది ఆయనే.

 

బాహుబలి స్థాయి సినిమా చేసే ఆలోచన ఉందా?

నేను అలాంటి పెద్ద చిత్రాలకు ఇంకా చాలా దూరంలో ఉన్నాను. ఒక వేళ నేను అంత స్థాయికి వెళితే రామాయణం చేస్తాను.

సంబంధిత సమాచారం :

X
More