ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ: రాశి ఖన్నా- సమంతను పోటీగా ఫీలవ్వను..!

Published on May 13, 2020 2:15 pm IST

గత ఏడాది వెంకీ మామ, ప్రతిరోజూ పండగే చిత్రాలతో వరుస హిట్స్ అందుకున్న రాశి ఖన్నా 2020లో వరల్డ్ ఫేమస్ లవర్ లో ఛాలెంజింగ్ రోల్ చేసి, నటిగా మంచి మార్కులు కొట్టేసింది. మన లాక్ డౌన్ సిరీస్ లో భాగంగా రాశి ఖన్నాను ఇంటర్వ్యూ చేసి అనేక విశేషాలు తెలుసుకోవడం జరిగింది.

 

లాక్ డౌన్ ప్రకటించే నాటికి మీరు ఎక్కడున్నారు?

తమిళ చిత్రం అరణమై 3 షూటింగ్ లో ఉండగా ఈ లాక్ డౌన్ గురించి తెలిసింది. అదృష్టవశాత్తు సేఫ్ గా హైదరాబాద్ చేరుకున్నాను. ప్రస్తుతం పేరెంట్స్ తో ఇంటిలో హ్యాపీగా ఉంటున్నాను.

 

వరల్డ్ ఫేమస్ లవర్ లో మీరు అద్భుతంగా చేశారు, ఐతే విమర్శలకు కూడా గురయ్యారు?

బహుశా ఆడియన్స్ నన్ను అలాంటి సీరియస్ రోల్స్ లో చూడడం ఇష్టపడడం లేదనుకుంటాను. ఈ కథ విన్నప్పుడే ఈ మూవీ తప్ప కుండా చేయాలని ఫిక్స్ అయ్యాను. కానీ ఒక్కొక్కసారి పేపర్ పై ఉన్న సన్నివేశం తెరపై పండదు. అలాగే సినిమా బెటర్మెంట్ కోసం చేసిన ఎడిటింగ్ లో నా పాత్రకు సంబంధించిన గొప్ప సన్నివేశాలు తీసివేయడం జరిగింది. ఏదిఏమైనా ఈ సినిమాలో పని చేయడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.

 

ఆడియన్స్ మిమ్ముల్ని హ్యాపీ అండ్ బబ్లీ రోల్స్ లో చూడడానికే ఇష్టపడుతున్నారేమో?

అవును సుప్రీమ్ సినిమా నుండి ప్రతిరోజు పండగే మూవీ వరకు నేను అలాంటి పాత్రలు చేసినప్పుడు ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు. నాకు అలాంటి పాత్రలు డిజైన్ చేసిన దర్శకులకు ధన్య వాదాలు.

 

వరల్డ్ ఫేమస్ లవర్ రిజల్ట్ దృష్ట్యా మీరు ఇకపై అలాంటి పాత్రలు చేయరా?

ఖచ్చితంగా చేస్తాను…నటిగా నిరూపించుకోవాలంటే అలాంటి పాత్రలు చేయాలి. అదేవిధంగా ప్రేక్షకులు నా నుండి ఏమి కోరుకుంటున్నారో అది కూడా పరిగణలోకి తీసుకొని బ్యాలన్స్డ్ రోల్స్ చేస్తాను. నటనకు ప్రాధాన్యం ఉంటే సీరియస్ రోల్స్ కూడా చేస్తాను.

 

తొలిప్రేమ నటిగా మీకు మంచి గుర్తింపు తెచ్చిన సినిమా, ఏమంటారు?

నిజంగా నా కెరీర్ కి మంచిగా ఉపయోగపడిన సినిమా తొలిప్రేమ. ఆ సినిమాలో నేను చేసిన పాత్ర నాకు తెలుగు మరియు తమిళ పరిశ్రమలో అవకాశాలు తెచ్చిపెట్టింది.

 

లవ్ అండ్ అఫైర్స్ గురించి మీపై వార్తలు రావడం అరుదు, ఏమంటారు?

(నవ్వుతూ) వార్తలు ఎందుకు రావంటే.. అలాంటి రిలేషన్స్ నాకేమి లేవు కాబట్టి. అలాగే గాసిప్స్ కూడా నేను పెద్దగా పట్టించుకోను. నా ద్రుష్టి అంతా ఎప్పుడూ చేసే పనిపైనే ఉంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు ఇంటిలో ఆనందంగా గడిపేస్తాను.

 

మీరు మొదట్నుండి హీరోయిన్ అవ్వాలని అనుకున్నారా?

అస్సలు అనుకోలేదు.. కానీ లైఫ్ అంటేనే సుర్ప్రైజెస్, కొన్ని సంఘటనలు నన్ను మోడలింగ్ వైపు నడిపించాయి. హిందీ చిత్రం మద్రాస్ కెఫె లో హీరోయిన్ గా అవకాశం వచ్చింది, ఆతరువాత తెలుగులో ఊహలు గుస గుసలాడే మూవీలో నటించాను. నేనైతే ఐ ఏ ఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాను.

 

ఆన్ స్క్రీన్ రాశి కన్నా మాకు తెలుసు, ఆఫ్ స్క్రీన్ లో మీరు ఎలాంటి అమ్మాయి?

ఆధ్యాత్మిక, బిడియం కలిగిన అమ్మాయిని నేను. నాపై వచ్చే పుకార్లను పెద్దగా పట్టించుకోను. ఇంట్లో ఉంటూ ఇష్టమైన వ్యాపకాలలో మునిగిపోవడం, పుస్తకాలు చదవడం ఇష్టమైన అలవాటు. అలాగే ఆర్భాటాలకు దూరంగా సింపుల్ గా ఉండడానికి ఇష్టపడతాను.

 

మీకు పరిశ్రమలో ఎవరిని పోటీగా ఫీలవుతారు?

నేను ఎవరినీ పోటీగా అనుకోను, ఐతే సమంత అంటే చాల ఇస్టపడతాను. ఆమె ఎంచుకునే పాత్రలు, యాక్టింగ్ నాకు స్ఫూర్తిని ఇస్తాయి. మజిలీ సినిమాలో ఆమె నటన అద్భుతం. అలాగే విజయ్ సేతుపతి గొప్ప నటుడు.

 

మీ లైఫ్ లో వరస్ట్ సిట్యుయేషన్ ఏదైనా ఉందా?

చాలా మందికి తెలియదు .. 2016లో నేను కొన్ని అనారోగ్య సమస్యలకు గురయ్యాను. దీనితో బాగా బరువు పెరిగాను. నా వెయిట్ పై వరుస కథనాలతో మీడియా కెరీర్ కి ఇబ్బంది కలిగేలా చేసింది. అప్పుడు మెంటల్ గా బాగా అప్ సెట్ అయ్యాను.

 

మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమిటీ?

రెండు తెలుగు చిత్రాలకు సైన్ చేయాల్సివుంది. అలాగే తమిళంలో మరో మూడు సినిమాలు ఉన్నాయి. చేతినిండా సినిమాలతో కెరీర్ హ్యాపీగా ఉంది, ఐతే సాధించాల్సింది ఇంకా ఉంది.

సంబంధిత సమాచారం :

X
More