ఇంటర్వ్యూ : హీరో హవీష్ – ‘సెవెన్’ థ్రిల్లర్-వాస్తవం చెప్పాలంటే థ్రిల్లర్స్ ఇష్టపడను

Published on Jun 1, 2019 5:17 pm IST

యంగ్ హీరో హవీష్, రెజీనా కాసాండ్రా, రెహ్మాన్, నందిత శ్వేత ప్రధాన తారాగణంగా నైజర్ షఫీ దర్శకతంలో తెరకెక్కిన మూవీ “సెవెన్”. రమేష్ వర్మ నిర్మించగా,చేతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రానున్న “సెవెన్” మూవీ రంజాన్ కానుకగా ఈ నెల 5న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్బంగా హీరో హవీష్ ఈ మూవీకి సంబంధించి కొన్ని విషయాలు తెలియజేశారు. ఇప్పుడు ఆ విశేషాలేంటో చూద్దాం.

వారాంతంలో కాకుండా ముందే విడుదల చేయడానికి కారణమేమిటి?

రంజాన్ కానుకగా విడుదల చేస్తే పండుగ కలెక్షన్స్ తోపాటు లాంగ్ వీకెండ్ వసూళ్ల పరంగా కలిసొస్తుందని ఈ నెల 5విడుదల చేయాలనినిర్ణయించాం.

‘ఎర్రగులాబీ’ మూవీకి ఈ మోవీకేమైనా పోలికలుంటాయా…?

ఎర్రగులాబీ మూవీకి “సెవెన్” మూవీకి ఎటువంటి పోలికలుండవు. ఎక్కడికిపోతావు చిన్నవాడా స్టోరీ లైన్ కి దగ్గరగా ఉంటుంది. ఆరుగురు హీరోయిన్స్ తో ఆద్యంతం మూవీ ఆహ్లాదంగా ఉంటుంది.

మూవీ విడుదల ఆలస్యానికి కారణాలేంటి?

ఎన్నో సినిమాల విడుదల మధ్య మన సినిమా కూడా ప్రేక్షకుల మనసులలో రిజిస్టర్ కావాలంటే ప్రొమోషన్స్ చాలా అవసరం . అందుకే చాలా రోజుల ముందునుండే ప్రమోషన్స్ మొదలుపెట్టాము. దాని ఫలితం ఇప్పుడు కనిపిస్తుంది.

థ్రిల్లర్ మూవీ ని ఎంచుకోవడానికి గల కారణాలేమిటి?

వాస్తవం చెప్పాలంటే ఈ సస్పెన్స్ థ్రిల్లర్లు చేయడం నాకు ఇష్టం ఉండదు. కానీ ఈ స్క్రిప్ట్ విన్నాక నాకు ఖచ్చితంగా చేయాలనే ఆసక్తికలిగింది. అందుకే వెంటనే ఓకే చెప్పేశాను. మా మూవీ డిఫరెంట్ కోణాలున్న విభిన్నమైన థ్రిల్లర్ . ప్రేక్షకుడు ప్రతి సన్నివేశంలో ఉత్కంఠను ఫీల్ అవుతాడు.

తమిళ్ లో పనిచేయడం ఎలా అనిపించింది?

మొదట్లో తమిళ డైలాగ్స్ చదవడం, వాటిని పలకటం చాలా ఇబ్బందిగా ఉండేది. నేను తమిళ్ వర్షన్ లో చేయనని కూడా డైరెక్టర్ కి చెప్పాను. కానీ నువ్వు చెయ్యగలవని నన్ను ప్రోత్సహించారు. ఎలాగోలా సినిమా పూర్తి చేసేశాను.

చాలా తక్కువ సినిమాలను చేస్తున్నారు ఎందుకు?

నిజానికి నేను ఓ పెద్ద సినిమా చేయాల్సింది,కానీ చివరి నిమిషంలో ఆ అవకాశం వేరే హీరో దక్కించుకున్నారు. అందుకే నా ఫిలిమ్స్ లేట్ అవుతున్నాయి. ఐతే ప్రస్తుతం నా పరిధిలో నేను ఓ మూడు సినిమాలకు సైన్ చేశాను.

సంబంధిత సమాచారం :

More