ఇంటర్వ్యూ : వందేమాతరం శ్రీనివాస్ నా టాలెంట్ ని గుర్తుపట్టారు – యజమానియా

ఇంటర్వ్యూ : వందేమాతరం శ్రీనివాస్ నా టాలెంట్ ని గుర్తుపట్టారు – యజమానియా

Published on Jul 1, 2014 6:50 PM IST

yajamanya
చిన్న సినిమాల పరంపరను కొనసాగిస్తూ త్వరలో వెండితెరపై మరో చిన్న చిత్రం ‘పోరా పోవే’ సినిమా విడుదలకానుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఈ చిత్ర సంగీతదర్శకుడు యజమానియా తో చిన్న ఇంటర్వ్యూ.. మరి అతను ఏమంటున్నాడో విందామా

ప్రశ్న) ఈ రంగంలోకి రావాలని ఎందుకు అనుకున్నారు?

స) నేను కీ బోర్డు ప్లే చేయడంలో పరిణితి సాధించాను. ఇండస్ట్రీలో దాదాపు అందరి సంగీతదర్శకుల దగ్గరా పనిచేశాను. కొంతకాలానికి ఈ రంగంలోనే స్థిరపడాలని నిర్ణయించుకున్నా

ప్రశ్న) మీకు స్పూర్తి దాయకమైన వ్యక్తి ఎవరు?

స) తప్పకుండా ఇళయరాజా గారనే చెప్పాలి . ఆయన సంగీతం వింటూ పెరిగి పెద్దవాన్నయ్యా. నాకు ఆయనే సంగీత గురువు

ప్రశ్న) ఈ ఇండస్ట్రీకి రావాలని ఎందుకనుకుంటున్నారు?

స) లోకల్ ప్రోగ్రామ్స్ లో కీ బోర్డ్ ప్లేయర్ గా పనిచేస్తున్న రోజుల్లో ఒకరోజు వందేమాతరం శ్రీనివాస్ తనతో పనిచెయ్యమని కోరాడు. అప్పట్నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్నా

ప్రశ్న) ఈ పోరా పోవే ఆల్బమ్ లో ఏంటి ప్రత్యేకత?

స) ఈ ఆల్బమ్ లో అన్ని రకాల పాటలను అందించగలిగాను.

ప్రశ్న) మీ తదుపరి ప్రాజెక్ట్ లు ఏంటి?

స) ఈ ప్రాజెక్ట్ తరువాత ప్రస్తుతం ‘నాటుకోడి’ చేస్తున్నా. అదికూడా పూర్తయింది. త్వరలో అది విడుదలకానుంది

ప్రశ్న) మీరు అద్నాన్ సమీని అనుకరించి ఒక పాటపాడారు. దీనికి కారణం?

స) నేను ఆయనకు పెద్ద ఫ్యాన్ ని. ఆయనతో పాట పాడించాలని అనుకున్నా, కానీ కుదరలేదు. అందుకే నేనే ఆయనను అనుకరిస్తూ ఒక పాట పాడాను. ప్రేక్షకులకు ఈ పాట నచ్చుతందని ఆశిస్తున్నా

సంబంధిత సమాచారం

తాజా వార్తలు