చిట్ చాట్ : పూజా రామచంద్రన్ – అన్ని మాసాల అంశాలు ఉన్న సినిమా ఈ ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’ !

నటుడు నందు ప్రధాన పాత్రలో దర్శకుడు వరప్రసాద్.వరికూటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇంట్లో ఎన్నెన్ని వింతలో’. పూజా రామచంద్రన్ కూడ ఒక కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ఈ నెల 6న రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా పూజా రామచంద్రన్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) ఈ సినిమా కథేమిటి ?
జ) ఒక కుర్రాడి పెళ్ళికి ముందురోజు రాత్రి జరిగిన కథ ఏమిటనేది ఈ సినిమా. మంచి మలుపులుంటాయి.

ప్ర) ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది ?
జ) ఇందులో నా పాత్ర పేరు తార. ఎమోషన్స్ ఉన్న పాత్ర. కథలో కీలకంగా కూడ ఉంటుంది.

ప్ర) అసలు మీ నైపథ్యం ఏమిటి ?
జ) నేను మలయాళీ. బెంగుళూరులోనే పుట్టి పెరిగాను. నాన్న ఆర్మ్ ఆఫీసర్. ఇండియాలో చాలా చోట్ల పనిచేశారు. అందుకే అన్ని ప్రాంతాలు చూసేశాను. నా మొదటి సినినిమా ‘లవ్ ఫైల్యూర్’. ఆ తర్వాత ‘గంగ, పిజ్జా, దేవిశ్రీ ప్రసాద్’ వంటి సినిమాల్లో కూడ నటించాను.

ప్ర) ఈ సినిమా పట్ల కాన్ఫిడెంట్ గా ఉన్నారా ?
జ) అవును.. ఖచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఇందులో అన్ని మాసాల అంశాలు ఉన్నాయి. ఎమోషన్, డ్రామా, ఫన్ అన్నీ ఉంటాయి.

ప్ర) ఈ సినిమాకు మీరే డబ్బింగ్ చెప్పుకున్నారా ?
జ) లేదు. నాకైతే నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్పుకోవాలని ఉంది. కానీ ప్రతి సినిమాకి కొన్ని డేట్స్ మాత్రమే ఇస్తుండటం వలన అది కుదరడం లేదు. కానీ అవకాశం వస్తే తప్పకుండా చెప్తాను.

ప్ర) మీ దర్శకుడి గురించి చెప్పండి ?
జ) దర్శకుడు వరప్రసాద్ వినాయక్ గారి దగ్గర వర్క్ చేశారు. ఆయనకు సినిమా గురించి బాగా తెలుసు. ఒక సినిమాకు కావాల్సిన అన్ని అంశాలను ఇందులో ఉంచారు. 35 రోజుల్లోనే 30 లొకేషన్లలో షూట్ చేసి సినిమాను పూర్తిచేశారు.