అల్లు అర్జున్ 21 కి ఇంట్రస్టింగ్ టైటిల్ !

Published on Apr 8, 2019 9:43 am IST

నా పేరు సూర్య తరువాత ఇంతవరకు తన కొత్త సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లలేదు కానీ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఫ్యాన్స్ ను థ్రిల్ చేస్తున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అందులో భాగంగా ప్రస్తుతం త్రివిక్రమ్ , సుకుమార్ తో మూడో సారి సినిమా లు చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇక ఈ రెండు కాకుండా ఈ రోజు బన్నీ బర్త్ డే సందర్భంగా తన 21వ చిత్రాన్ని కూడా అధికారికంగా ప్రకటించాడు.

ఈ చిత్రాన్ని ‘ఓ మై ఫ్రెండ్ , ఏంసిఏ’ చిత్రాల దర్శకుడు వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేయనున్నాడు. దిల్ రాజు, వేణు కు ఛాన్స్ ఇవ్వడం ఇది మూడవ సారి. ఇక ఈ చిత్రానికి ‘ఐకాన్’.. అనే టైటిల్ ను ఫిక్స్ చేసి కనబడుటలేదు అనేది ట్యాగ్ లైన్ గా పెట్టారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించనున్నారు.

ఇక అల్లు అర్జున్, త్రివిక్రమ్ , సుకుమార్ సినిమాలను పూర్తి చేశాక ఈ సినిమా ను మొదలుపెట్టానున్నాడు. సో బన్నీ నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లో ఫ్రీ కానున్నాడన్న మాట.

సంబంధిత సమాచారం :