ప్రకాశ్ రాజ్ కొత్త సినిమాకు ఆసక్తికర టైటిల్!

ప్రకాశ్ రాజ్ కొత్త సినిమాకు ఆసక్తికర టైటిల్!

Published on Nov 22, 2015 7:14 PM IST

Prakash-raj
విలక్షణ నటనతో ఎలాంటి పాత్రనైనా రక్తికట్టించగల నటుడు ప్రకాశ్ రాజ్, నిర్మాతగా, దర్శకుడిగానూ అద్భుతమైన ఖ్యాతి గడించిన విషయం తెలిసిందే. ఆకాశమంత, ధోని, ఉలవచారు బిర్యాని, గౌరవం లాంటి పలు అభిరుచి గల సినిమాలను రూపొందించి దర్శక నిర్మాతగా ప్రకాశ్, తనదైన బ్రాండ్ సృష్టించారు. ఇక తాజాగా ఈ కోవలో ప్రకాష్ రాజ్ తెలుగు, తమిళ భాషల్లో మరో కొత్త ప్రయోగం చేస్తున్నారు.

డిసెంబర్ నెలలో సెట్స్‌పైకి వెళ్ళనున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరిదశకు చేరాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, లోగోను ఈ ఉదయం ప్రకాష్ రాజ్ విడుదల చేశారు. మన ఊరి రామాయణం అన్న టైటిల్‌తో ప్రకాశ్ రాజ్ కొత్త సినిమా రూపొందనుంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం సమకూర్చనున్న ఈ సినిమాను ప్రకాష్ స్వయంగా నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు