అనిల్ రావిపూడి నెక్స్ట్ ఫిల్మ్ పై ఇంట్రస్టింగ్ న్యూస్ !

అనిల్ రావిపూడి నెక్స్ట్ ఫిల్మ్ పై ఇంట్రస్టింగ్ న్యూస్ !

Published on Jan 24, 2019 1:24 AM IST

డైలాగ్ రైటర్ గా కెరీర్ మొదలు పెట్టి .. సక్సెస్ ఫుల్ సినిమాల డైరెక్టర్ గా ఎదిగాడు అనిల్ రావిపూడి. తాజాగా విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ లతో ‘ఎఫ్ 2’ అనే క్రేజీ మల్టీ స్టారర్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం మంచి పాజిటివ్ రిపోర్ట్స్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రెవిన్యూని రాబట్టి ఈ ఏడాది సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం అనిల్ నెక్స్ట్ ఫిల్మ్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అనిల్ తన తరువాత చెయ్యబొయ్యే సినిమా కోసం అప్పుడే స్క్రిప్ట్ మొదలు పెట్టినట్లు.. అది కూడా ఒక లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టు ప్రిపేర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్త ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు