ముఖ్య అంశాలు
- సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే అధికారికంగా ప్లేఆఫ్స్ చేరుకుంది. ఇక అసలు పోరాటం టాప్-2 స్థానం కోసమే.
- ఎస్ఆర్హెచ్ మొదట బ్యాటింగ్ చేస్తే, ఆర్సీబీపై కనీసం 83 నుంచి 89 పరుగుల భారీ తేడాతో గెలవాలి.
- ఒకవేళ ఛేజింగ్‌కు దిగితే మాత్రం, ప్రత్యర్థి నిర్దేశించిన లక్ష్యాన్ని కేవలం 11 ఓవర్లలోపే కొట్టేయాలి.
ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు తుది దశకు చేరుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) అభిమానులకు అసలైన పండుగ అప్పుడే మొదలైంది. ఎందుకంటే, ప్యాట్ కమిన్స్ సేన ఇప్పటికే ప్లేఆఫ్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుని ఫుల్ జోష్‌లో ఉంది. అయితే, ఇప్పుడు వాళ్ల ముందున్న అసలు లక్ష్యం పాయింట్ల పట్టికలో టాప్-2. క్వాలిఫైయర్-1 ఆడితే ఫైనల్ చేరడానికి రెండు అవకాశాలు ఉంటాయి కాబట్టి, ఆ మొదటి రెండు స్థానాల్లో దేన్నైనా దక్కించుకోవడంపైనే ఆరెంజ్ ఆర్మీ ఫోకస్ పెట్టింది.
ఈ క్రమంలో శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగే మ్యాచ్ సన్‌రైజర్స్‌కు అత్యంత కీలకం. టాప్-2కి వెళ్లాలంటే ఈ మ్యాచ్‌లో కేవలం గెలిస్తే సరిపోదు.. తమ నెట్ రన్ రేట్‌ను (NRR) అమాంతం పెంచుకోవాలి. దీనికోసం టీమ్ ముందు కఠినమైన సమీకరణాలు ఉన్నాయి.
మొదట బ్యాటింగ్ చేస్తే లెక్కలు ఇవే..
సన్‌రైజర్స్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేస్తే.. ఆర్సీబీని భారీ తేడాతో చిత్తు చేయాలి. ఉదాహరణకు 180 నుంచి 204 పరుగులు చేస్తే.. కనీసం 87 పరుగుల తేడాతో గెలవాలి. అదే 200కు పైగా (205-228) పరుగులు చేస్తే 88 పరుగుల తేడాతో విజయం సాధించాలి. అంటే బ్యాటర్లు చెలరేగాలి.. బౌలర్లు ప్రత్యర్థిని వంద లోపే కట్టడి చేయాలి.
ఛేజింగ్ అయితే పరిస్థితి ఏంటి?
ఒకవేళ ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేసి టార్గెట్ సెట్ చేస్తే, సన్‌రైజర్స్ దాన్ని సుడిగాలిలా ఛేజ్ చేయాలి. లక్ష్యం 163 నుంచి 300 పరుగుల మధ్య ఉంటే.. దాన్ని కేవలం 11 ఓవర్లలోపే ఊదేశాయాలి. అదే టార్గెట్ 100 నుంచి 162 పరుగుల మధ్య ఉంటే 11.1 ఓవర్లలో మ్యాచ్ పూర్తి చేయాలి. ట్రవిస్ హెడ్, అభిషేక్ శర్మ లాంటి హిట్టర్లు విధ్వంసం సృష్టిస్తేనే ఇది సాధ్యమవుతుంది.
ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరిన ఉత్సాహంలో ఉన్న సన్‌రైజర్స్.. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడనుంది. ఈ కఠినమైన టార్గెట్‌ను వాళ్లు ఎలా రీచ్ అవుతారో చూడాలి. ఆర్సీబీపై మ్యాజిక్ చేసి టాప్-2 దక్కితే మాత్రం ఫ్యాన్స్‌కు ఇక పండగే!
