రవితేజ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఇరుముడి చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. భక్తి, కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ మేళవింపుగా రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్టు 21న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా నుంచి మొదటి పాటను విడుదల చేశారు. ‘ఇరుముడి కట్టు.. శబరిమల ఎక్కు..’ అంటూ సాగే ఈ పాట లిరిక్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయని ఫ్యాన్స్ పోస్ట్ లు పెడుతున్నారు.
అన్నట్టు, తమిళంలో ఈ చిత్రం ‘ఇరుముడికట్టు’ పేరుతో విడుదల కానుంది. ఇక ‘కొన్ని కథలు జీవితంలో సరైన సమయంలో మనల్ని ఎంచుకుంటాయి. అలాంటి ఒక కథే ఈ ఇరుముడి. ఇందులో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. కొత్త ప్రయాణంలో ఉత్సాహంగా ఉన్నా’’ అని రవితేజ ఆ మధ్య చెప్పుకొచ్చారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకి జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో బేబీ నకాస్త్ర రవితేజ కుమార్తెగా నటిస్తోంది.


