సాలిడ్ ఓపెనింగ్స్ దిశగా ‘ఇరుముడి’.. రవితేజ క్రేజ్ మామూలుగా లేదుగా..!

సాలిడ్ ఓపెనింగ్స్ దిశగా ‘ఇరుముడి’.. రవితేజ క్రేజ్ మామూలుగా లేదుగా..!

Published on Aug 18, 2026 4:00 PM IST

Irumudi

మాస్ మహారాజా రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇరుముడి’ ఈ వారం బాక్సాఫీస్ దగ్గర సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ మంచి బజ్‌తో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం నార్త్ అమెరికాలో అద్భుతమైన రెస్పాన్స్‌తో ప్రీ-సేల్స్ ఖాతా తెరిచింది.

ప్రీమియర్స్‌కు ముందే నార్త్ అమెరికా ప్రీ-సేల్స్ 50,000 డాలర్లు దాటి సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోంది. ఈ చిత్రాన్ని విదేశాల్లో ప్రముఖ పంపిణీ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తోంది. మాస్ మహారాజా రవితేజ, ప్రియా భవానీ శంకర్ కలయికలో వస్తున్న ఈ చిత్రంపై మొదటి నుంచీ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఈ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ఆగస్టు 20న గ్రాండ్ ప్రీమియర్స్‌తో ఓవర్సీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర టీజర్, ట్రైలర్‌లలో రవితేజ మాస్ అవతార్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు ఇప్పటికే ట్రెండింగ్‌లో ఉన్నాయి. విదేశాల్లో నమోదు అవుతున్న ఈ ఓపెనింగ్స్ చూస్తుంటే, ‘ఇరుముడి’ రవితేజ కెరీర్‌లోనే ఓ మైలురాయిగా నిలవడం ఖాయమనిపిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు