“ఆచార్య” అప్పటికి షిఫ్ట్ అవుతుందా..?

Published on Apr 15, 2021 7:03 am IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెగా తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరో కీలక పాత్రలో బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “ఆచార్య”. ఇప్పటికే భారీ స్థాయి అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం షూట్ ఇప్పుడు శరవేగంగా కొనసాగుతుంది. ప్రస్తుతం చరణ్ పై సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్న కొరటాల అండ్ టీం సినిమా రిలీజ్ డేట్ పై పునరాలోచనలో ఉన్నారని టాక్ ఇప్పుడు చక్కర్లు కొడుతుంది.

మొదటగా మే నెలకు ప్లాన్ చేసిన ఈ చిత్రాన్ని మేకర్స్ జూన్ నెల లోకి షిఫ్ట్ చేసినట్టుగా టాక్ వినిపిస్తుంది. అలాగే జూన్ రెండో వారంలో ఈ సినిమా విడుదల బహుశా ఉండొచ్చని సినీ వర్గాల్లో వినబడుతున్న టాక్. ఇప్పటికే చాలా సినిమాలు వాయిదా పడ్డాయి మరి మే నాటి సినిమాల పరిస్థితి ఏమిటో కాలమే నిర్ణయించాలి. ఇక ఈ చిత్రంలో కాజల్ మరియు పూజా హెగ్డేలు హీరోయిన్స్ గా నటించగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు అలాగే మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :