ఓటీటీలోకి ఆకాష్ పూరి ‘రొమాంటిక్’ ?

Published on May 16, 2021 6:32 pm IST

ఆకాష్ పూరి హీరోగా రానున్న ‘రొమాంటిక్’ సినిమా ఓటిటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాబోతుందని గతంలోనే వార్తలు వినిపించాయి. అయితే, ఆ తరువాత ఈ సినిమా గురించి మళ్ళీ అప్ డేట్ లేదు. అయితే, మళ్ళీ తాజాగా నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమాకి భారీ ఆఫర్ ఇచ్చిందని.. అన్ని కుదిరితే ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇక యంగ్ డైరెక్టర్ అనిల్ పాదూరి డైరెక్షన్ లో రాబోతున్న ఈ చిత్రం ఫస్ట్ కాపీతో రెడీగా ఉంది. ఇక ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో ఆకాశ్ పూరి సరసన కేతికా శ‌ర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా మాఫియా నేపథ్యంలో ఓ ప్రేమ కథగా తెరకెక్కనుందట.

మరి ఈ సినిమాతోనైనా ఆకాష్ పూరికి హిట్ వస్తోందేమో చూడాలి. .ఇక హిందీ నటుడు మకరంద్ దేశ్ పాండే కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :