“ఆదిపురుష్” లో మరో బాలీవుడ్ స్టార్ నటుడు.?

Published on May 25, 2021 3:05 pm IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న పలు భారీ బడ్జెట్ చిత్రాల్లో దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముని పాత్ర చేస్తుండగా కృతి సనన్ సీతగా కనిపించనుంది.

అయితే ఇది వరకే కొంత మేర షూట్ జరుపుకున్న ఈ చిత్రం నుంచి క్యాస్టింగ్ పరంగా కొన్నాళ్లుగా సాలిడ్ బజ్ వినిపిస్తున్నాయి. ఇటీవలే బాలీవుడ్ ప్రముఖ నటుడు సిద్దార్థ్ శుక్లా ఓ కీలక పాత్రలో నటించనున్నాడని గాసిప్ బయటకి వచ్చింది. ఇక ఇదిలా ఉండగా మరో స్టార్ నటుడు జాన్ అబ్రహం పేరు కూడా రేస్ లోకి వచ్చిందని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

అయితే జాన్ పేరు ఇది వరకు ప్రభాస్ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” కూడా వినిపించింది. మరి ఆదిపురుష్ విషయంలో అయినా ఎంత వరకు నిజమవుతుందో చూడాలి. ఇక ఈ భారీ చిత్రంలో సైఫ్ అలీఖాన్ రావణ పాత్రలో నటిస్తుండగా 3డి లో భారీ బడ్జెట్ తో ప్లాన్ చేసిన ఈ సినిమా వచ్చే ఏడాది ఆగష్టు లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :