మిస్టర్ బాక్సాఫీస్ నుంచి మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్.?

Published on Jun 5, 2021 9:00 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కు అభిమానులు పెట్టుకున్న మరో పేరు కూడా ఉంది అదే మిస్టర్ బాక్సాఫీస్.. ప్లాప్ టాక్ తో కూడా మినిమమ్ వసూళ్లు రాబట్టగలిగే హీరోల్లో చరణ్ కూడా ఒకడు. అందుకే అతన్ని అలా పిలుచుకుంటారు. అయితే మరి ఇప్పుడు చరణ్ రాజమౌళి “RRR” అనే బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.

అలాగే ఈ చిత్రం అనంతరం మరో భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తో సినిమా చేయనున్నాడు. మరి ఇలా ఈ రెండు చిత్రాల అనంతరం మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ లైన్ లో పెట్టాడని నిన్నటి నుంచి టాక్ ఊపందుకుంది. అదే కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో.. ప్రస్తుత “RRR” నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ తోనే నీల్ ఓ సినిమా ఒప్పుకోగా దాంట్లో చరణ్ హీరో అని ఓ టాక్ గట్టిగా స్ప్రెడ్ అవుతుంది. మరి నిజంగానే ప్రశాంత్ నీల్ అండ్ చరణ్ కాంబో సెట్టవుతుందా లేక వేరే ఏమన్నానా అన్నది కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :