“ఆచార్య” నుంచి కూడా మరో స్పెషల్ అప్డేట్ ఉందా?

Published on Oct 12, 2021 4:15 pm IST


మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ చిత్రం “ఆచార్య”. మెగా ఫాన్స్ ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సాలిడ్ మల్టీ స్టారర్ చిత్రం “ఆచార్య”. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాని ఇటీవల మేకర్స్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ చిత్రం నుంచి మరో స్పెషల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉందని బజ్ వినిపిస్తుంది.

రేపు స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే బర్త్ డే కానుకగా ఓ అప్డేట్ ని మేకర్స్ ఇస్తారని టాక్ మొదలైంది. ఈ సినిమాలో మరో కీలక పాత్ర చేస్తున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి జోడిగా పూజా హెగ్డే ‘నీలాంబరి’ గా కనిపించనుంది. మరి తన పాత్రపై ఏదొక అప్డేట్ ఇవ్వనున్నట్టుగా ఇప్పుడు టాక్. ఇది ఎంతవరకు నిజమవుతుందో తెలియాలి అంటే ఇంకొంత ఆగాల్సిందే. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :