“బిగ్ బాస్” హౌస్ లోకి ఎంట్రీ కానున్న అనుష్క.?

Published on Sep 27, 2020 10:00 am IST

ప్రపంచపు అత్యంత బిగ్గెస్ట్ రియాలిటీ అయినటువంటి బిగ్ బాస్ మన తెలుగులో కూడా ఇంతే పెద్ద హిట్టయ్యిందో అందరికీ తెలిసిందే. అలా ఇప్పటి వరకు మూడు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో నాలుగో సీజన్లో కూడా భారీ స్థాయి రేటింగ్ తో టాక్ తో సంబంధం లేకుండా దూసుకుపోతుంది. అయితే బిగ్ బాస్ షో అన్నాక అనేకమంది తారలు స్పెషల్ గెస్టులుగా వస్తారన్న సంగతి తెలిసిందే.

అలా ఈసారి మన సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ స్వీటీ అనుష్క స్పెషల్ గెస్ట్ గా వెళ్లి పలకరించనున్నారని సర్వత్రా బజ్ నెలకొంది. తాను ప్రస్తుతం చేసిన హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ “నిశ్శబ్దం” చిత్రం వచ్చే నెల 2న అమెజాన్ ప్రైమ్ వీడియో లో డిజిటల్ ప్రీమియర్ గా విడుదలకు రెడీ అయ్యింది. అందులో భాగంగా ఇప్పటికే చిత్ర యూనిట్ వర్చువల్ గా ప్రమోషన్స్ మొదలు పెట్టేసారు. అలా అనుష్క అండ్ టీం ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో స్టేజ్ పై అడుగు పెట్టనున్నారట. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

More