‘శర్వానంద్’ సరసన ఆషికా రంగనాథ్ ?

‘శర్వానంద్’ సరసన ఆషికా రంగనాథ్ ?

Published on Jan 18, 2026 7:00 AM IST

Ashika Ranganath

హీరో శర్వానంద్ – శ్రీను వైట్ల కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ పై ఇప్పుడు ఓ కొత్త రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌ గా ఆషికా రంగనాథ్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. భర్త మహాశయులకు విజ్ఞప్తిలో రవితేజ సరసన నటించి ఆకట్టుకుంది ఆషికా రంగనాథ్. ఐతే, ఈ వార్త పై ఇంకా అధికారిక అప్ డేట్ రాలేదు. మరోవైపు శర్వానంద్ ఈ సినిమా కోసం తన లుక్ ను మళ్లీ కొత్తగా ట్రై చేయబోతున్నట్లు తెలుస్తోంది. అన్నట్టు ఈ సినిమా షూటింగ్ మార్చి నుంచి స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

ముందుగా హీరో శర్వానంద్ పై ఎంట్రీ సీన్స్ ను షూట్ చేస్తారట. ఈ సీక్వెన్స్ కి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన లొకేషన్స్ ను కూడా సెర్చ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఐతే, గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ ‘విశ్వం’ ఏవరేజ్ గా నిలిచింది. దీంతో, ఎలాగైనా మళ్ళీ టాలీవుడ్ లో తన తర్వాత సినిమాతో బిజీ అయ్యేందుకు శ్రీనువైట్ల తెగ కష్ట పడుతున్నాడట. అన్నట్టు ఈ సినిమాలో మరో సీనియర్ హీరో కూడా కనిపిస్తాడని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది.

తాజా వార్తలు