బిగ్ బాస్ 4 – ఈమెను సేవ్ చెయ్యడానికి బాగా ట్రై చేస్తున్నారా?

Published on Nov 29, 2020 12:00 pm IST

అసలు ఈ వారంలో అంటే వీక్ ఎపిసోడ్స్ లో అంతగా ఏమీ లేదు అనుకునే సమయానికి నిన్నటి ఎపిసోడ్ తో కావాల్సినంత అటెన్షన్ ను మేకర్స్ తెచ్చుకోగలిగారు. సరైన మైండ్ గేమ్ తో ఆడియెన్స్ కు ఎలా చేస్తే రీచ్ అవుతుందో ఆ టైప్ లో ఎపిసోడ్ ను డిజైన్ చేసారు. సరే ఇదంతా బాగానే ఉంది కానీ ఓ కంటెస్టెంట్ విషయంలో మాత్రం మేకర్సే కాపాడటానికి ట్రై చేస్తున్నారని మరోసారి వీక్షకుల మదిలో మెదలడం మొదలయ్యింది.

ఆ కంటెస్టెంట్ ఎవరో కూడా ఇప్పటికే క్లారిటీ వచ్చి ఉంటుంది, ఆమెనే మోనాల్ గజ్జర్. అసలు ఇన్ని వారాలు ఖచ్చితంగా ఈమె ఉంటుంది అని షోను మొదటి నుంచి ఫాలో అయ్యేవారు అనుకోని ఉండరు. పలు సందర్భాల్లో అయితే ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతుంది అనుకుంటే ఆమె తప్ప మిగతా వారు అయ్యేవారు దీనితో అక్కడే అనేక డౌట్స్ వీక్షకులకు వచ్చాయి.

కానీ ఇపుడు మాత్రం మోనాల్ అలా లేదు. గత రెండు వారాల్లో బాగానే తన గ్రాఫ్ పెంచుకుంటూ వచ్చింది. మరి కేవలం ఇందుకే తాను ఇప్పుడు సేఫ్ అయ్యినట్టు కూడా చెప్పడం అంత కరెక్ట్ కాదని నెటిజన్స్ ఒపీనియన్. ఇలా మొత్తంగా మాత్రం ఈమె విషయంలో ఎక్కడో కాస్త సాఫ్ట్ కార్నర్ నడుస్తుంది అనే చాలా మంది అనుకుంటున్నారు. మరి ఫైనల్ గా ఏం జరుగుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More