అల్లు అర్జున్ జాబితాలోకి మరో ఇద్దరు దర్శకులు ?
Published on Jun 14, 2018 1:59 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమా అనుకునంత విజయాన్ని సాధించలేదు. దాంతో బన్నీ తన తరువాతి చిత్రాన్ని జాగ్రత్త గా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆయన చేయబోయే సినిమాలపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.

బన్నీ హీరోగా విక్రమ్ కె కుమార్ భారీ బడ్జెట్ తో ఒక సినిమాని తీయబోతున్నారని కొన్నిరోజులగా వార్తలు వినిపిస్తున్నాయి . తాజాగా ఇప్పుడు ఈ జాబితాలోకి ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ , సురేందర్ రెడ్డి లు చేరారు వీరితో కూడా బన్నీ సినిమాలు చేయనున్నాడని సమాచారం. ఇంతకు ముందు బన్నీ త్రివిక్రమ్ తో ‘జులాయి , సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలు చేశాడు రెండు మంచి విజయాన్ని సాధించాయి ఇక మరొక డైరెక్టర్ సురేందర్ రెడ్డి తో ‘రేసుగుర్రం’ సినిమా చేశాడు ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. మరి బన్నీ వీరిలో ఎవరి సినిమాని మొదలు పెడతారో చూడాలి ప్రస్తుతం ఆయన ఫ్యామిలీ తో కలిసి వొకేషన్ కు పారిస్ వెళ్లారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook