ప్రశాంత్ వర్మ “హను-మాన్” సూపర్ హీరో అతనేనా.?

Published on May 30, 2021 12:02 am IST

టాలీవుడ్ లో ఇపుడు తన అద్భుతమైన సబ్జెక్ట్స్ తో షైన్ అవుతున్న యంగ్ అండ్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ ప్రశాంత్ వర్మ. మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా గత కొన్ని రోజులు నుంచి ఎదురు చూస్తున్న ప్రశాంత్ వర్మ కొత్త సినిమా అప్డేట్ ఈరోజే బయటకి వచ్చింది. అయితే ఈసారి కూడా మన తెలుగులో ఎప్పుడు టచ్ చెయ్యని సూపర్ హీరో జానర్ ను తీసుకొని “హను-మాన్” అనే సినిమాను అనౌన్స్ చేసి మళ్ళీ ఇండస్ట్రీ అటెన్షన్ ను అందుకున్నాడు.

అయితే ఈ ప్రకటనతో ఒక వీడియోను మేకర్స్ వదిలారు తప్పితే మరే ఇతర డీటెయిల్ ను వెల్లడి చెయ్యలేదు. మరి ఈ చిత్రంలో సూపర్ హీరోగా కనిపించేది ఎవరు అన్నదానికి సమాధానం దొరికినట్టు తెలుస్తుంది. ప్రశాంత్ వర్మ నుంచి లేటెస్ట్ అండ్ లాస్ట్ గా వచ్చిన “జాంబీ రెడ్డి” హీరో తేజ సజ్జ తోనే చేయనున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. మరి దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :