ప్రభాస్ తో సంజయ్ రౌత్ తో “ఏ- ఆది పురుష్” అనే మరో భారీ సినిమా చేస్తోన్న దగ్గర నుండి ఈ సినిమాలో వాళ్ళు నటిస్తున్నారు, వీళ్ళు నటిస్తున్నారు అంటూ రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఆల్ రెడీ షూట్ స్టార్ట్ అయ్యాక కూడా ఈ రూమర్స్ ఆగకపోవడం విచిత్రమే. తాజాగా మరో రూమర్ ఒకటి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ‘ఆదిపురుష్’లో మాజీ హీరోయిన్ కాజోల్ కూడా ఓ కీలక పాత్రలో నటించబోతుందని తెలుస్తోంది. ఇక ఈ వార్త గురించి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే లేదు.
కాగా దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. భారీ స్థాయీలో హాలీవుడ్ సినిమాలకి ఏమాత్రం తీసిపోకుండా రూపొందించబోతున్న ఆదిపురుష్ కోసం ప్రస్తుతం ప్రభాస్ బాడీ పెంచుతున్నాడు. ఎందుకంటే సినిమాలో ప్రభాస్ ఎనిమిది అడుగుల అజానబాహుడిగా కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో మరో అత్యంత కీలక పాత్ర ఉందని.. ఆ పాత్రలో కూడా ప్రభాసే కనిపిస్తాడట.