“కేజీయఫ్ 2” అప్పటికి ఫిక్సయ్యిందా.?

“కేజీయఫ్ 2” అప్పటికి ఫిక్సయ్యిందా.?

Published on Dec 6, 2020 2:00 AM IST

ప్రస్తుతం మన సౌత్ ఇండియా నుంచి మొత్తం ఇండియన్ బాక్సాఫీస్ నే షేక్ చెయ్యడానికి రెడీ అవుతున్న పలు భారీ పాన్ ఇండియన్ చిత్రాల్లో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న మాస్ యాక్షన్ థ్రిల్లర్ “కేజీయఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి.

అయితే ఈ భారీ చిత్రం విడుదల కోసం ఎప్పటి నుంచో ప్రేక్షకులు ఎంత గానో ఎదురు చూస్తున్నారు. ఇక దీనితో పాటుగా ఇప్పటికే ఈ చిత్ర టీజర్ కు కూడా మేకర్స్ ముహూర్తం ఖరారు చేసేసారు. వచ్చే ఏడాది జనవరి 8న టీజర్ ను ఫిక్స్ చేశారన్న వార్తతో పాటు అసలు ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారు అన్న దానిపై కూడా టాక్ వినిపిస్తుంది.

ఈ చిత్రాన్ని సాధ్యమైనంత వరకు సమ్మర్ రేస్ లో నిలపాలని మేకర్స్ గట్టిగా ప్రయత్నిస్తున్నారట. మరి దీనిపై సరైన సమాచారం రావాల్సి ఉంది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ అధీరా అనే పవర్ ఫుల్ విలన్ రోల్ లో నటిస్తున్నారు. మరి ఈ మోస్ట్ అవైటెడ్ సినిమాను మేకర్స్ ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు