టాక్..”లవ్ స్టోరీ” మేకర్స్ త్వరపడనున్నారా.!

Published on Aug 21, 2021 7:01 am IST

ప్రస్తుతం టాలీవుడ్ లో కాస్త భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి.. థియేటర్ తలుపులు మళ్లీ తెరుచుకున్నప్పటికీ పలు చిత్రాలు ఇంకా ఓటీటీకి పలు కారణాల చేత వెళ్లడం మాత్రం ఆగలేదు. అలాగే మరోపక్క కీలక చిత్రాలు కూడా థియేటర్స్ లోకి వస్తున్నాయి. మరి వాటిలో అక్కినేని నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా మ్యాజికల్ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన “లవ్ స్టోరీ” కూడా ఒకటి. అయితే ఈ చిత్రం విషయంలో కాస్త గందరగోళ వాతావరణం నెలకొంది..

సరిగ్గా ఈ సినిమా డేట్ కే మరో కీలక చిత్రాలు ఓటిటి కి ఫిక్స్ అవ్వడంతో అది లవ్ స్టోరీ సినిమాకి అడ్డంకి గా మారుతుంది అని సినీ వర్గాలలో నడుస్తున్న హాట్ టాపిక్. దీనితో సినిమా వసూళ్లపై దెబ్బ పడుతుంది అని అందుకే ఈ చిత్రంను మేకర్స్ ముందుగా రిలీజ్ చేస్తారని టాక్ నడుస్తుంది.. అయితే ప్రస్తుతానికి ఇంకా ఇందులో ఎలాంటి అధికారిక క్లారిటీ లేదు. ముందు రోజుల్లో మ్యాటర్ ఏమిటి అన్నది క్లారిటీ రానుంది అని తెలుస్తోంది. ఇప్పటికే మంచి అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం విషయంలో ఏం జరగనుందో చూడాలి.

సంబంధిత సమాచారం :