జపాన్ లో విడుదల కానున్న మగధీర ?

జపాన్ లో విడుదల కానున్న మగధీర ?

Published on Jun 24, 2018 10:31 PM IST


2009 లో విడుదలై బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసిన చిత్రం మగధీర .రామ్ చరణ్ , కాజల్ అగర్వాల్ జంటగా దర్శక ధీరుడు రాజమౌళి తెరెకెక్కించిన ఈ చిత్రం తెలుగులో చాలా రికార్డులను బద్దలు కొట్టింది . ఇప్పడు దాదాపు 9 సంవత్సరాల తరువాత ఈ సినిమాను జపాన్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు అని సమాచారం రాజమౌళి మరియు చిత్ర టీం కలిసి ఈ సినిమా జపనీస్ డబ్బింగ్ పనులు మొదలు పెట్టారట కానీ దీనిపై అధికారికంగా సమాచారం లేదు.

ఇటీవల రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ చిత్రం జపాన్ లో విడుదలై సుమారు $1 మిల్లియన్ వసూళ్లను సాధించింది . దాంతో ఇప్పుడు ఈ చిత్రాన్ని కూడా అక్కడ రిలీజ్ చేస్తే మంచి కలెక్షన్స్ ను ఖాతాలో వేసుకోవడం ఖాయం మరి ఈ చిత్రం జపాన్ లో ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు