కెప్టెన్ గా మహేష్ విట్టా, ఎలిమినేషన్ వారిద్దరిలో ఒకరా?

Published on Sep 20, 2019 5:48 pm IST

తరచుగా ఎలిమినేషన్ లో ఉండే బిగ్ బాస్ ఇంటి సభ్యుడు మహేష్ విట్టా తొలిసారి ఇంటి కెప్టెన్ అయ్యారు. గత రాత్రి జరిగిన టాస్క్ లో బాబా భాస్కర్ ని ఓడించి మహేష్ ఇంటి కెప్టెన్ గా ఎన్నికయ్యారు. కెప్టెన్ హోదా కోసం జరిగిన ఎన్నికలలో ఇంటి సభ్యులలో మెజారిటీ సభ్యులు మహేష్ పట్ల మొగ్గు చూపడంతో ఆయన కెప్టెన్ అయ్యారు. ఐతే ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ ఈవారం ఎలిమినేషన్ కొరకు ఎంపికైన ముగ్గురు సభ్యులలో మహేష్ విట్టా కూడా ఉన్నారు.

ఈవారం ఎలిమినేషన్ కి గాను రాహుల్, హిమజ, మహేష్ నామినేట్ చేయబడ్డారు. నిన్న ఎపిసోడ్ లో మహేష్ కెప్టెన్ గా బాధ్యలు స్వీకరించడంతో ఆయన ఎలిమినేషన్ నుండి తప్పించుకున్నట్లే అని అనిపిస్తుంది. దీనితో మిగిలిన ఇద్దరు సభ్యులైన రాహుల్, హిమజ లలో ఒకరు షోకి గుడ్ బాయ్ చెప్పే అవకాశాలు ఎక్కువ కలవు. ఈ విషయంపై స్పష్టంగా చెప్పలేం. ఒక వేళా రాహుల్, హిమజ ల కంటే మహేష్ కి తక్కువ ఓట్లు వస్తే కెప్టెన్ అయినప్పటికీ బిగ్ బాస్ మహేష్ ని ఎలిమినేట్ చేయవచ్చు. ఇక చూడాలి రేపు ఏమి జరగనుందో.

సంబంధిత సమాచారం :

X
More