‘డేవిడ్‌ రెడ్డి’ కోసం మనోజ్ డబ్బింగ్ ?

‘డేవిడ్‌ రెడ్డి’ కోసం మనోజ్ డబ్బింగ్ ?

Published on Mar 30, 2026 7:01 AM IST

David-Reddy-1

రాకింగ్ స్టార్ మంచు మనోజ్‌ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్‌ యాక్షన్‌ మూవీ ‘డేవిడ్‌ రెడ్డి’. హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పై లేటెస్ట్ అప్ డేట్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ వర్క్ కొనసాగుతోంది. మనోజ్ తనదైన డైలాగ్ డెలివరీతో ఈ సినిమాలో అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఐతే, ఘాట్ ఇంకా బ్యాలెన్స్ ఉందని.. అయినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా శరవేగంగా చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోందట.

ఇక ‘డేవిడ్‌ రెడ్డి’ కథ విషయానికొస్తే.. స్వాతంత్రానికి పూర్వం జరిగిన కథ ఇది. బ్రిటిష్‌ వారిపై పోరాడిన ‘డేవిడ్‌ రెడ్డి’ అనే యోధుడి కథగా రానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ‘వార్‌ డాగ్‌’ అనే బైక్‌ను రూపొందించారు. దాని బరువు దాదాపు 700 కేజీలు. సినిమాలో అది ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అన్నట్టు ఈ సినిమాలో మనోజ్‌ సరసన ‘ప్రిన్స్‌’ (కోలీవుడ్‌ మూవీ) హీరోయిన్‌ మరియా నటించబోతుంది.

తాజా వార్తలు