నాని ఇంకాస్త ముందే క్లాస్ అండ్ మాస్ “టక్” చూపిస్తాడా.?

Published on Jan 26, 2021 10:02 am IST

నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న పలు ఇంట్రెస్టింగ్ చిత్రాల్లో తన హిట్ దర్శకుడు శివ నిర్వానతో ప్లాన్ చేసిన రెండో చిత్రం “టక్ జగదీష్”. వీరి కాంబోలో ఇంతకు ముందే “నిన్ను కోరి” అనే క్లీన్ లవ్ స్టోరీ రావడం దానికి భిన్నంగా టక్ జగదీష్ ను ప్లాన్ చెయ్యడం మరింత హైప్ ను తెచ్చుకుంది.

మరి అలాగే ఈ చిత్రాన్ని క్లాస్ అండ్ మాస్ గా ప్రొజెక్ట్ చేస్తుండడంతో ఆ అంచనాలు మరింత స్థాయిలో పెరిగాయి. అయితే ఈ సినిమాను ఈ ఏడాది వేసవి కానుకగా తీసుకొస్తున్నట్టు మేకర్స్ ఏప్రిల్ 16 న డేట్ లాక్ చేశారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ చిత్రం మరింత ముందుకు వస్తున్నట్టుగా బజ్ మొదలయ్యింది.

దాని ప్రకారం నాని బాక్సాఫీస్ టక్ మార్చ్ నెలలో ఉంటుంది అన్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో రీతూ వర్మ మరియు ఐశ్వర్య రాజేష్ లు హీరోయిన్స్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందించాడు. మరి అలాగే ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :