‘వారణాసి’ ఆ రూమర్స్ లో నిజం లేదా?

‘వారణాసి’ ఆ రూమర్స్ లో నిజం లేదా?

Published on Jun 14, 2026 7:00 PM IST

Varanasi

ఇప్పుడు ఇండియన్ సినిమా నుంచి రానున్న అవైటెడ్ సినిమాల్లో దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ వారణాసి కోసం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇండియన్ సినిమా నుంచి పూర్తిగా ఐమాక్స్ వెర్షన్ లో భారీ హంగులతో తెరకెక్కుతోంది ఈ సినిమా. ఇప్పుడు జక్కన్న సినిమాలు అంటే భారీ బడ్జెట్ అనేది చాలా కామన్ పాయింట్.

అలాంటిది తన సినిమాకి బడ్జెట్ పెరుగుతూ వెళ్ళిపోతుంది అనేది కూడా వినిపిస్తూనే ఉంటుంది. అయితే జక్కన్న సినిమా బడ్జెట్ పరంగా ఎంత పక్కాగా, ప్లాన్ చేసుకుంటారు అనేది తన నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీలు చూస్తే అర్ధం అయిపోతుంది. అలాంటిది ఇప్పుడు వారణాసి పై అదేదో సినిమా సమస్యల్లోకి వెళ్ళిపోయింది అన్న రేంజ్ లో ఓ టాక్ ని ఊదరగొట్టేస్తున్నారు. ఇందులో దాదాపు నిజం లేదనే అనుకోవాలి.

ఎక్కడెక్కడ ఎంత అవసరమో అంతే రేంజ్ లో షూట్ ఆయా లొకేషన్స్ లో దాదాపు జరిగిపోయింది. పైగా మన దగ్గరే భారీ స్టూడియోస్ కూడా పెట్టి బయట ఖర్చులు తగ్గించారు. ఒకవేళ నిజంగానే ఖర్చు పెరిగింది అనుకున్నా ఈ సినిమా నిర్మాణంలో తన కొడుకు కార్తికేయ కూడా భాగస్వామ్యం అయ్యి ఉన్నారు. సో వారణాసి బడ్జెట్ పెరిగింది ఎటెటో సినిమా వెళ్ళిపోతుంది అని కంగారు పెట్టడం పడటం ఒకింత అర్ధ రహితం. సో ఈ మాసివ్ ప్రాజెక్ట్ చేసే మ్యాజిక్ కోసం వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు