‘టాక్సిక్’ లేట్ కి ఓటిటి కూడా కారణం కాదా?

‘టాక్సిక్’ లేట్ కి ఓటిటి కూడా కారణం కాదా?

Published on Apr 28, 2026 12:13 PM IST

Toxic-Movie

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “టాక్సిక్”. కేజీయఫ్ లాంటి సంచలన హిట్ చిత్రాలు తర్వాత తన నుంచి రాబోతున్న సినిమా ఇదే. అయితే ఒకప్పుడు ఈ సినిమాపై భారీ హైప్ ఉన్న మాట నిజమే కానీ వరుస వాయిదాలు రీత్యా యష్ ఫ్యాన్స్ లో బజ్ ఉంది తప్పితే మిగతా ఆడియెన్స్ లో మాత్రం ఈ సినిమా కోసం ఎదురు చూసే వారి సంఖ్య తక్కువే ఉంది.

అయితే టాక్సిక్ విడుదల గత మార్చ్ లోనే కావాల్సి ఉంది కానీ అప్పుడు గల్ఫ్ దేశాల్లో పరిస్థితులు బాలేవని విడుదల ఆపినట్టు తెలిపారు. కానీ ఇప్పుడు జూన్ రిలీజ్ డేట్ ఇబ్బందులు విషయంలో ఓటిటి డీల్ ఇంకా పూర్తి కాకపోవడం మూలాన కొత్త డేట్ కోసం తాము చూస్తున్నట్టు పలు రూమర్స్ ఉన్నాయి.

అయితే ఒకవేళ మళ్ళీ వాయిదా పడితే దీనికి కారణం ఓటిటి కూడా కాదా? అనే కోణం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడే ఓటిటి డీల్ సెట్ కాలేదు అంటే మార్చ్ లోకి కూడా అవ్వనట్టే కదా? సో కేవలం ఓటిటి డీల్ కారణం గానే ఆలస్యం అవుతుంది అంటే దీనిపై మరిన్ని డౌట్స్ రాక మానవు. మరి సినిమా అవుట్ పుట్ విషయంలో తాము కాన్ఫిడెంట్ గా లేరా? లేక ఓటిటి డీల్ పూర్తి కాకపోవడమేనా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. సో ఈ విషయంలో యష్ ప్లానింగ్ ఏంటో అనేది చూడాలి.

తాజా వార్తలు